2026 దాకా న్యాచురల్ స్టార్ కూడా బిజీ..!

ఇక నానితో నెక్స్ట్ సినిమా చేయాలి అంటే అది 2026 లోనే కుదురుతుంది.

Update: 2024-09-08 03:56 GMT

టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వాటిని సూపర్ హిట్లుగా మలుస్తూ సూపర్ ఫాం లో ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని అదేంటో ఇతర హీరోలు అదే మీడియం రేంజ్ హీరోలు కొత్త వారితో చేసే సినిమాలు దారుణంగా పోతుంటే నాని ఇంట్రడ్యూస్ చేస్తున్న దర్శకులు మాత్రం అదరగొట్టేస్తున్నారు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో టాలీవుడ్ కి శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ అనే ఇద్దరు దర్శకులను పరిచయం చేసిన నాని ఈ ఇయర్ సరిపోదా శనివారం అంటూ వివేక్ ఆత్రేయతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే వివేక్ ఆత్రేయ ఆల్రెడీ 3 సినిమాలు చేశాడు. నానితో అంటే సుందరానికీ చేసినా అది కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోవడంతో సరిపోదా శనివారం తో లెక్క సరి చేశాడు.

ఇక ఇలా హిట్ కొట్టాడో లేదో అలా మరో సినిమా షురూ చేశాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ 3 చేస్తున్నాడు నాని. ఈ సినిమాను హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా భారీ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2025 మే రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా చివరి దశలో ఉన్నప్పుడే సుజిత్ డైరెక్షన్ లో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు నాని.

సో సుజిత్ సినిమా ఎలా లేదన్నా 6 నెలలు టైం పడుతుంది. దానితో పాటుగా నాని శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఇక నానితో నెక్స్ట్ సినిమా చేయాలి అంటే అది 2026 లోనే కుదురుతుంది. ఓ పక్క బడా హీరోలంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో రెండు మూడేళ్లు టైం తీసుకుంటుంటే ఇటు నాని కూడా వరుస సినిమాలతో క్యలెండర్ ఫిల్ చేసుకున్నాడు.

నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనిపించేలా చేసుకున్నాడు. దసరా, సరిపోదా శనివారం సినిమాలతో మాస్ హిట్లు కూడా అందుకున్నాడు. సో ఇక మీదట నాని ఎలాంటి సినిమా అయినా చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. నాని కొత్త సినిమా చేయాలంటే మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే అని చెప్పొచ్చు. టైర్ 2 హీరోల్లో నాని మాత్రం సూపర్ జోరు కొనసాగిస్తున్నాడు. సరిపోదా శనివారంతో టైర్ 1 కి ప్రమోట్ అయినట్టు చెబుతున్నా దసరా తర్వాత 100 కోట్లు కొట్టి తన బాక్సాఫీస్ స్టామినా ఇది అని ప్రూవ్ చేసుకునేలా చేస్తున్నాడు నాని.

Tags:    

Similar News