కల్కి 2 ఇలా లీక్ చేస్తే ఎలా నాని..!

ప్రేక్షకులకు ఒక మంచి విజువల్ ఫీస్ట్ అందించడంలో సినిమా సక్సెస్ అయ్యింది.

Update: 2024-08-31 05:53 GMT

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ 500 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మించారు. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె లాంటి భారీ తారాగణం సినిమాలో భాగమైంది. ముందు ఈ ప్రాజెక్ట్ ని ఒక సినిమాగా చేయాలని అనుకున్నా పాత్రలు చాలా బలంగా రావడంతో రెండు భాగాలు చేశారు. కల్కి 1 అంచనాలను అందుకోఅడంలో సక్సెస్ అయ్యింది. ప్రేక్షకులకు ఒక మంచి విజువల్ ఫీస్ట్ అందించడంలో సినిమా సక్సెస్ అయ్యింది.

కల్కి హిట్ అవ్వడంతో కల్కి 2 మీద అంచనాలు పెరిగాయి. ఐతే కల్కి 2 కథ ఎలా ఉంటుంది అన్న క్లారిటీ లేదు. కానీ న్యాచురల్ స్టార్ నాని కల్కి 2 కథ లీక్ చేశారు. నాని నటించిన సరిపోదా శనివారం సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కల్కి గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. కల్కి 2లో కృష్ణుడిగా తాను నటిస్తానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. కల్కి 2 లో తను లేనని క్లారిటీ ఇచ్చారు నాని.

కల్కి 2 లో అర్జునుడు, కర్ణుడు కీలకం కానున్నారని అన్నారు. కల్కి 2898 ADలో విజయ్ దేవరకొండ అర్జునుడిగా క్యామియో మాత్రమే ఇచ్చారు. కానీ నాని చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే కల్కి 2 లో ప్రభాస్ తో పాటుగా విజయ్ దేవరకొండ స్క్రీన్ టైం కూడా ఎక్కువ ఉండేలా ఉంది. నాని ఎలాగు కల్కి టీం తో టచ్ లో ఉన్నాడు కాబట్టి అతను చెప్పిన దానిలో కచ్చితంగా వాస్తవం ఉందని నమ్మొచ్చు. సో కల్కి 2 లో ఇటు అశ్వద్ధామ, సుప్రీం యాక్సిన్ తో పాటుగా కర్ణుడు, అర్జునుడు పాత్రలు కీలకం కానున్నాయి.

కల్కి 1 చివర్లో కర్ణుడిగా ప్రభాస్ కనిపించిన కొద్దిసేపే థియేటర్ లో ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా చేసిన నాగ్ అశ్విన్ కల్కి 2 మొత్తం అదే కథతో తెరకెక్కిస్తున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కల్కి 2 షూటింగ్ జనవరి, ఫిబ్రవరిలో మొదలు పెడతామని మేకర్స్ చెబుతున్నారు. అయితే సినిమా మాత్రం 2026 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News