నాని 100 కోట్ల పవర్..

దీంతో 'దసరా' తర్వాత 100+ కోట్ల కలెక్షన్స్ అందుకున్న రెండో చిత్రంగా 'సరిపోదా శనివారం' నిలిచింది.

Update: 2024-09-16 03:58 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సరిపోదా శనివారం' సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజాగా 100 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరినట్లు మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. దీంతో 'దసరా' తర్వాత 100+ కోట్ల కలెక్షన్స్ అందుకున్న రెండో చిత్రంగా 'సరిపోదా శనివారం' నిలిచింది. ఈ సినిమా వసూళ్లతో నాని మార్కెట్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయిందని చెప్పొచ్చు.

 

డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి అన్ని చోట్ల అద్భుతమైన ప్రజాధారణ లభించినట్లు తెలుస్తోంది. మూడో వారంలో కూడా ఈ చిత్రం సాలిడ్ రన్ తో దూసుకుపోతోందని మేకర్స్ తెలిపారు. సినిమాలో నేచురల్ స్టార్ నాని మరోసారి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులు కంటెంట్ కి ఎంగేజ్ అయ్యేలా చేశాడు. అలాగే విలన్ గా నటించిన ఎస్.జె సూర్య తన విలక్షణ నటనతో అందరిని అలరించాడు. సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా నాని కంటే సూర్యకి ఎక్కువ ప్రశంసలు లభించాయి.

ఓవర్సీస్ లో కూడా 'సరిపోదా శనివారం' సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో ఈ చిత్రం 2.48 మిలియన్ డాలర్స్ గ్రాస్ అందుకుంది. ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే 2.50 మిలియన్ డాలర్స్ ని త్వరలో చేరువ అవుతుందనే మాట వినిపిస్తోంది. అయితే నార్త్ అమెరికాలో దసరా చిత్రం 2.76 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. దానిని 'సరిపోదా శనివారం' అందుకుంటుందా అంటే చెప్పలేమనే మాట వినిపిస్తోంది.

'దసరా' మూవీ వరల్డ్ వైడ్ గా 117.50 కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. ఆరంభంలో 'సరిపోదా శనివారం' స్పీడ్ చూసిన వారు కచ్చితంగా 'దసరా' మూవీ కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుందని భావించారు. అయితే తెలుగు రాష్ట్రాలలో తుఫాన్, వరదల ఇంపాక్ట్ సరిపోదా శనివారం కలెక్షన్స్ పై చాలా గట్టిగా పడింది. రిలీజ్ తర్వాత ఆది వారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు, వరదల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

ఈ ప్రభావం టోటల్ కలెక్షన్స్ పైన పడింది. అందుకే 'దసరా' మూవీ కలెక్షన్స్ రికార్డ్ ని సరిపోదా శనివారం బ్రేక్ చేయలేకపోయింది. నెక్స్ట్ నాని నుంచి హిట్ ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 వస్తోంది. ఈ చిత్రం 150 కోట్ల కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 'హిట్ 3' మూవీని ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News