'సరిపోదా శనివారం'.. నైజాంలో కూడా అదే జోరు

నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ సినిమా థియేటర్స్ లో సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది.

Update: 2024-09-16 05:15 GMT

నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ సినిమా థియేటర్స్ లో సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ఈ మూవీ తాజాగా 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. రెండు వారాలు కంప్లీట్ చేసుకొని మూడో వారంలో కూడా ఈ చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. సినిమాకి అన్ని చోట్ల మంచి ఆదరణ వస్తూ ఉండటంతో ‘దేవర’ మూవీ రిలీజ్ వరకు ‘సరిపోదా శనివారం’ సందడి ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

నేచురల్ స్టార్ కెరియర్ లోనే సెకండ్ హైయెస్ట్ గ్రాస్ అందుకున్న చిత్రంగా ‘సరిపోదా శనివారం’ నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా 18వ రోజు నైజాంలో ఏకంగా 81 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందంట అలానే వరల్డ్ వైడ్ గా పద్దెనిమిదో రోజు కోటి అరవయ్యి లక్షలు గ్రాస్ ని అందుకుంది . ఈ కలెక్షన్స్ బట్టి చూస్తే నైజాం ఏరియాలో ‘సరిపోదా శనివారం’ చిత్రానికి ఎంత అద్భుతమైన ఆదరణ లభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ‘సరిపోదా శనివారం’ నైజాం రైట్స్ 12.50 కోట్లకి అమ్ముడయ్యాయి. 18 రోజుల్లో ఈ మూవీ 15+ కోట్లకి పైగా షేర్ ని ఈ చిత్రం నైజాంలో కలెక్ట్ చేసింది.

అంటే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటిపోయి మంచి ప్రాఫిట్ తో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో మూవీ దూసుకుపోతోంది. 100 కోట్లకి పైగా గ్రాస్ అందుకోవడం ద్వారా ఇప్పటికే సరిపోదా శనివారం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం థియేటర్స్ లో ఒక్క ‘మత్తు వదలరా 2’ తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఇదే స్పీడ్ లో దేవర మూవీ రిలీజ్ వరకు ఈ చిత్రం థియేటర్స్ లో కొనసాగితే నిర్మాతకి మంచి ప్రాఫిట్ ని తీసుకొస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీద ఉన్న నాని ‘హిట్ 3’ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నాని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా ‘హిట్ 3’ మూవీ తెరకెక్కుతోంది. దీని తర్వాత శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించబోయే సినిమాకి కూడా ఏకంగా 100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారంట. వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News