నార్త్ అమెరికా.. నాని అదే హవా

నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

Update: 2024-09-09 06:58 GMT

నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగష్టు 29 వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ఇతర భాషలలో ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయిన తెలుగులో మాత్రం రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. దసరా తర్వాత మరోసారి మాస్ యాక్షన్ కథాంశంతో సరిపోదా శనివారం సినిమా చేసి నాని సక్సెస్ అందుకున్నారు.


అంటే సుందరానికి సినిమాతో వివేక్ ఆత్రేయ నానికి హిట్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు పెర్ఫెక్ట్ ప్లానింగ్, స్క్రిప్ట్ తో సరిపోదా శనివారం మూవీతో సూపర్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమా ఇప్పటి వరకు 11 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇదిలా ఉంటే సరిపోదా శనివారం సినిమాతో నేచురల్ స్టార్ నాని నార్త్ అమెరికాలో కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటి వరకు నార్త్ 2.4 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

నాని దసరా మూవీ లాంగ్ రన్ లో 2.76 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని నార్త్ అమెరికాలో అందుకుంది. దసరా మూవీ కలెక్షన్స్ కి సరిపోదా శనివారం సినిమా వసూళ్లు దగ్గరగా వచ్చేసాయి. లాంగ్ రన్ లో దసరా కలెక్షన్స్ ని ఈ చిత్రం బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా సరిపోదా శనివారం మూవీ 10 రోజుల్లో 80 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది. ఇదే స్థాయిలో మరో రెండు వారాలు నిలకడగా థియేటర్స్ లో కొనసాగితే 100 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని క్రాస్ చేస్తుందని భావితున్నారు.

ఈ రెండేళ్లలో నాని మూడు వరుస హిట్స్ ని తన ఖాతాలో వేసుకొని బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అతనికి 60 కోట్ల వరకు మార్కెట్ ఉంది. సరిపోదా శనివారం మూవీ తర్వాత మార్కెట్ వేల్యూ 80 కోట్లకి పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే నాని శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజ్ లో పార్ట్ 2 చిత్రాన్ని తాజాగా స్టార్ట్ చేశారు.

Tags:    

Similar News