నాని- జాన్వీ కాంబో.. ఇది మ్యాటర్!

కొద్ది రోజులుగా వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నానని, అందుకే ఆ ప్రాజెక్ట్‌ గురించి వివరాలను క్లారిటీగా తెలుసుకోలేకపోతున్నానని అన్నారు.

Update: 2024-08-26 16:30 GMT

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని మరో మూడో రోజుల్లో సరిపోదా శనివారం చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా విడుదలకు సిద్ధమైపోయింది. ఆగస్టు 29వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. దీంతో నాని కొద్ది రోజులుగా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. హైదరాబాద్, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబైలో తెగ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మూవీ టీమ్ కు గట్టి సపోర్ట్ గా నిలుస్తూ ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు.

అయితే నాని చేతిలో మరో రెండు చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. తనకు దసరాతో బిగ్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరోసారి వర్క్ చేయనున్నారు. ఇప్పటికే ఆ మూవీ అనౌన్స్మెంట్ రాగా.. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఆ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే జాన్వీని మేకర్స్ సంప్రదించారని కూడా టాలీవుడ్ లో ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది.

ఇప్పుడు ఈ విషయంపై సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో నాని స్పందించారు. తన నెక్స్ట్ సినిమాలో జాన్వీ నటిస్తుందని వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని తెలిపారు. ఆ తర్వాత ఆమెను తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చని మళ్లీ డౌట్ క్రియేట్ చేశారు. కొద్ది రోజులుగా వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నానని, అందుకే ఆ ప్రాజెక్ట్‌ గురించి వివరాలను క్లారిటీగా తెలుసుకోలేకపోతున్నానని అన్నారు. ఇప్పుడు నాని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

దీంతో అసలు నాని మూవీలో జాన్వీ నటిస్తుందో లేదో అస్సలు అర్థం కాలేదని నెటిజన్లు చెబుతున్నారు. ముందు రూమర్ అన్న నాని.. ఆ తర్వాత టీమ్ చర్చలు జరుపుతుందోమో అని చెప్పడంతో కొత్త కన్ఫ్యూజన్ మొదలైందని అంటున్నారు. అయితే హీరోకు తెలియకుండా ఏ మూవీ మేకర్స్ కూడా హీరోయిన్ ను సెలెక్ట్ చేయడం, సంప్రదించడం అస్సలు జరగవన్న విషయం అందరికీ తెలిసిందే. మరి నాని ఎందుకు అలా అన్నారు? జాన్వీని అప్రోచ్ అవ్వడం తెలిసే వ్యాఖ్యానించారా?

ఈ డౌట్లపై టాలీవుడ్ వర్గాలు క్లారిటీ ఇచ్చేశాయి! జాన్వీ కపూర్.. జూనియర్ ఎన్టీఆర్ దేవరతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె లుక్స్ ఆకట్టుకున్నా.. మూవీ రిలీజ్ అయ్యాక తెలుగు ఆడియన్స్ కు చేరువవుతుందో లేదో తెలుస్తుంది. అందుకే నాని.. అలా తెలివిగా ఇప్పుడు ఆన్సర్ ఇచ్చారని చెబుతున్నారు. దేవర రిలీజ్ అయ్యాక జాన్వీని ఫిక్స్ చేసే విషయంలో మేకర్స్ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?

Tags:    

Similar News