ప్రభాస్ ప్లానింగ్ తోనే నాని కూడా..!
ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి మే 9న రిలీజ్ లాక్ చేయగా దాదాపు సినిమా ఆ డేట్ న వస్తుందని అంటున్నారు.
ఐదేళ్లలో కేవలం రెండు సినిమాలు చేసిన ప్రభాస్ బాహుబలి కోసం తన కెరీర్ రిస్క్ లో పెట్టాడు. అయినా సరే అంతకంత క్రేజ్ సంపాదించాడు. స్టార్ సినిమా ఏడాదికి ఒకటి రిలీజైతే చూడాలని ఫ్యాన్స్ కోరుతారు కానీ అది జరగడం చాలా కష్టమనిపిస్తుంది. అయితే ప్రభాస్ మాత్రం తన ఫ్యాన్స్ ని వెయిట్ చేయించింది చాలని అనుకున్నాడు. అందుకే లాస్ట్ ఇయర్ రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. ఈ ఇయర్ కూడా మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి మే 9న రిలీజ్ లాక్ చేయగా దాదాపు సినిమా ఆ డేట్ న వస్తుందని అంటున్నారు. ఇక మారుతితో చేస్తున్న రాజా సాబ్ సినిమాను కూడా నవంబర్ కల్లా పూర్తి చేసి డిసెంబర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ డిసెంబర్ రిలీజ్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. సలార్ తో లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో హిట్ అందుకున్న ప్రభాస్ మరోసారి అదే సెంటిమెంట్ తో వస్తున్నాడు. అయితే ప్రభాస్ దారిలోనే న్యాచురల్ స్టార్ నాని కూడా డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు.
లాస్ట్ ఇయర్ మార్చిలో దసరా డిసెంబర్ లో హాయ్ నాన్నతో రెండు హిట్లు అందుకున్న నాని ఈ ఇయర్ కూడా సమ్మర్ లో సరిపోదా శనివారం డిసెంబర్ లో మరో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. డిసెంబర్ చివర్లో ప్రభాస్ అదే క్రిస్మస్ కి సందడి చేసేలా వస్తుంటే.. ఆ నెల మొదటి వారం నాని తన సినిమాతో ప్రేక్షకులను అలరించాలని ఫిక్స్ అయ్యాడు.
అయితే ప్రతిసారి అలా కుదరకపోవచ్చు కానీ లాస్ట్ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా ప్రభాస్ సినిమాతో పాటు తన సినిమాను కూడా డిసెంబర్ లో రిలీజ్ చేసేలా నాని ప్లానింగ్ ఉందట. అయితే సరిపోదా శనివారం సమ్మర్ లేదా ఒక నెల అటు ఇటు అనుకుంటున్నా మరో ఆరు నెలల్లో పూర్తి చేసే కథ కోసం నాని వెతుకుతున్నాడని తెలుస్తుంది. కొత్త వారితో నాని చేసే ప్రయత్నాలు కమర్షియల్ గా బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. అందుకే నాని సినిమా ఏమంత పెద్ద హడావిడి లేకుండానే మొదలవుతుంది.. షూటింగ్ పూర్తవుతుంది.. రిలీజ్ అవుతుంది.. అలానే హిట్ కూడా అవుతుంది. మరి ఈ డిసెంబర్ కి నాని ఏ సినిమాతో వస్తారన్నది చూడాలి.