'బలగం' వేణుతో నాని.. మరోసారి అలాంటి కథే..

వేణు చెప్పిన కథకి నాని చాలా ఇంప్రెస్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Update: 2024-01-25 06:40 GMT

నాచురల్ స్టార్ నాని గత ఏడాది దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. కెరీర్ లో డిఫరెంట్ రోల్స్ ఎంచుకొని సినిమా సినిమాకి కొత్తదనం చూపిస్తూ వస్తున్న నాని ఇప్పుడు మరోసారి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. రీసెంట్ గా 'హాయ్ నాన్న' సినిమాలో తన క్లాస్, సెటిల్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న నాని ఇప్పుడు 'సరిపోదా శనివారం' సినిమాతో యాక్షన్ మోడ్ లోకి దిగాడు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో నాని కంప్లీట్ యాక్షన్ అవతార్ లో కనిపించబోతున్నాడు. DVV దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే నాటికి షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత 'బలగం' సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన వేణుతో నాని ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.


రీసెంట్ గానే నాని - వేణు ప్రాజెక్ట్ కి సంబంధించి కథా చర్చలు జరగగా ఇటీవల ఫైనల్ నేరేషన్ కూడా కంప్లీట్ అయినట్లు తెలిసింది. వేణు చెప్పిన కథకి నాని చాలా ఇంప్రెస్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి ఆసక్తికర లీక్ బయటికి వచ్చింది. అదేంటంటే, ఈ సినిమా తెలంగాణ పల్లెటూరిలో జరిగే ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ అని అంటున్నారు.

నాని ఇదివరకే 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో పీరియాడిక్ కాన్సెప్ట్ టచ్ చేశాడు. అందులో సాయి పల్లవితో లవ్ సీన్స్ హైలెట్ అయ్యాయి. ఈ సినిమాతో పాటు క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన జెర్సీ కూడా వింటేజ్ వైబ్స్ తో వచ్చింది, దసరా సినిమా సినిమాలు కూడా వెనకటి కాలంలో జరిగిన కథలే. ఇప్పుడు మళ్లీ నాని కొత్తగా తెలంగాణ లవ్ స్టోరీ తో పాత కాలానికి తీసుకెళ్తున్నాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాని నటించిన దసరా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.

ఇప్పుడు మరోసారి బలగం వేణుతో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే పిరియాడికల్ లవ్ స్టోరీ అంటే కచ్చితంగా నాని కెరియర్ లో ఈ ప్రాజెక్ట్ మరో మైల్ స్టోన్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ కోసం వెతుకులాట జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.


Tags:    

Similar News