యానిమాల్.. నాన్నపై వైల్డ్ లవ్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో అయితే చిత్ర యూనిట్ సభ్యులు చాలా తెలివిగా అడుగులు వేస్తూ ఉన్నారు. మొదట పోస్టర్స్ తోనే హైప్ పెంచారు. ఇక ఆ తర్వాత టీజర్ తో అంచనాల స్థాయి మరింత పెరిగింది. ఇక ఇప్పుడు రియాలిటీ షోలు ఇంటర్వ్యూలు అంటూ సినిమా రేంజ్ ను మరింతగా పెంచుతున్నారు.
ఇక సాంగ్స్ కూడా ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే హీరో హీరోయిన్ మధ్యలో ఉండే లవ్ బాండింగ్ అలాగే కెమిస్ట్రీ ను హైలెట్ చేసేలా ఒక పాటను విడుదల చేశారు. ఇక సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ గట్టిగానే ఉండబోతున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మరో ఫాదర్ పై ఉన్న ప్రేమను వ్యక్తపరిచే విధంగా మరొక పాటలు విడుదల చేశారు.
నాన్న నువ్వు నా ప్రాణం.. అనే ఈ పాటలో ఎమోషన్స్ స్ట్రాంగ్ గా హైలెట్ అవుతున్నాయి. ఈ సిమిమలో రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ నటించారు ఇక తండ్రిపై ఉన్న ప్రేమను హీరో చిన్నప్పటి నుంచి ఎలా పెంచుకుంటాడు ఒక ఆపద వస్తే అతని కోసం అతను ఎలాంటి పనులు చేసాడు అనే అంశాలు కూడా పాటలో పైలెట్ అవుతున్నాయి.
హర్షవర్ధన్ రామేశ్వరం కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా సోను నిగమ్ పాడారు. మొత్తానికి పాటలో అయితే హీరో ఎంత బలవంతుడు అయినప్పటికీ కూడా తండ్రి ముందు మాత్రం చాలా ప్రేమతో ఉండే కొడుకుగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అతని ప్రేమను అలాగే విరత్వాన్ని చూసిన తండ్రి ఆశ్చర్యంగా కనిపిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ హై రేంజ్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు సరికొత్తగా యాక్షన్ తో పాటు కొన్ని ఎమోషన్స్ ని కూడా డిఫరెంట్ గా చూపిస్తాడని తెలుస్తోంది. ఇక సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న నటించింది. వీరిద్దరి మధ్యలో ఉండే కెమిస్ట్రీ లవ్ తో పాటు రొమాంటిక్ డోస్ కూడా గట్టిగానే ఉంటుందట. ఇక మొత్తానికి మరో పాట తో సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేశారు. మరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.