నక్కల జాతికి థియేటర్ లో నో ఎంట్రీ..కలెక్టర్ కి ఫిర్యాదు!
భారతదేశంలో జాతివివక్ష దాదాపు కనుమరుగైపోయింది. మారిన జీవిన, దైనందిన జీవితంలో ఎన్నో మార్పులో చ్చాయి
భారతదేశంలో జాతివివక్ష దాదాపు కనుమరుగైపోయింది. మారిన జీవిన, దైనందిన జీవితంలో ఎన్నో మార్పులో చ్చాయి. అంతా సమానమే అన్న భావం కనిపిస్తుంది. అన్ని రంగాల్లోనూ..అన్ని ప్రదేశాల్లోనూ అంతా సమానమే. కానీ తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఇంకా జాతివివక్ష కొన్ని చోట్లో అప్పుడప్పుడు కోరలు చాచుతున్నట్లే కనిపిస్తుంది. తాజాగా రిలీజ్ అయిన తమిళ సినిమా `గరుడన్` థియేటర్లోకి నక్కల జాతికి చెందిన వారిని థియేటర్ లోకి వెళ్లనివ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ శుక్రవారమే ఆ సినిమా రిలీజ్ అయింది. సినిమాకి పాజిటివ్ రాకవడంతో జనమంతా థియేటర్ కి తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో స్థానిక నక్కల జాతికి చెందిన 20 మంది కడలూర్ సమీపంలోని అన్నా థియేటర్ కి సినిమా చూడటానికి వెళ్లారు. అయితే వారిని థియేటర్ యాజమాన్యం లో పలికి వెళ్లనివ్వలేదు. మీలాంటి వాళ్లకు థియేటర్ లోపలికి వెళ్తే మిగతా వారు అసౌకర్యానికి గురవుతారని, పంపిచమంటూ యాజమాన్యం చెప్పడంతో నక్కల జాతి ఎందుకు అనుమతి లేదంటూ తిరగబడ్డారు.
దీంతో ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. మరింత మంది నక్కల జాతి వారు థియేటర్ వద్దకు చేరుకుని వివాదాన్ని పెద్దది చేసే ప్రయత్నం చేసారు. వెంటన్ స్పాట్ కి పోలీస్ లు చేరుకుని వివాదాన్ని పరిస్థితిని చక్కదిద్దారు. అన్నా థియేటర్ వద్ద భారీ ఎత్తున పోలీస్ లు మోహరించారు. దీంతో నక్కలజాతి వారు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు. జాతి వివక్ష కారణంగా ప్రవేశం లేకపోవడం ఏంటి? అని ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం.
అలాగే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. నక్కల జాతి వారిని గతంలో కూడా థియేటర్ లోకి అనుమతించిన ఘటన చోటు చేసుకుంది. తాజాగా మరోసారి అదే వివాదం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకి దర్శకుడు వెట్రీమారన్ కథ అందించి స్వయంగా నిర్మించారు. ఇందులో ఉన్ని ముకుందన్, శశికుమార్ కీలక పాత్రలు పోషించారు. దురై సెంథిల్ దర్శకత్వం వహించిన సినిమాకి మంచి టాక్ వచ్చింది.