విడాకుల త‌ర్వాత హార్థిక్‌కి న‌టాషా ఇచ్చిన షాక్

నటాసా స్టాంకోవిచ్ - హార్దిక్ పాండ్యా విడాకుల గురించి ప్ర‌క‌టించ‌డం అభిమానుల‌కు బిగ్ షాక్.

Update: 2024-09-04 16:30 GMT

నటాసా స్టాంకోవిచ్ - హార్దిక్ పాండ్యా విడాకుల గురించి ప్ర‌క‌టించ‌డం అభిమానుల‌కు బిగ్ షాక్. ఈ జంట‌కు నాలుగేళ్ల కుమారుడు అగ‌స్త్య ఉన్నాడు. అత‌డు త‌ల్లిని కానీ తండ్రిని కానీ విడిచి ఉండ‌లేడు. కానీ న‌టాషా త‌న కుమారుడిని తీసుకుని త‌న స్వ‌స్థ‌లానికి (విదేశాల‌కు) వెళ్లిపోయింది. దీంతో చిన్నారి అగ‌స్త్య త‌న తండ్రి గురించి త‌ల్ల‌డిల్లాడు. అత‌డికి నిజానికి తండ్రి పాండ్యాతో అనుబంధం ఎక్కువ అని కూడా వెల్ల‌డైంది. పాండ్యా త‌న కుమారుడిని అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. అందుకే పాండ్యా కూడా కుమారుడిని త‌ల‌చి క‌ల‌త‌కు గుర‌య్యాడు.

అయితే ఇంత‌లోనే ఇప్పుడు ఒక కొత్త ట్విస్టు. 4 ఏళ్ల కుమారుడు అగస్త్య తన తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత మొదటిసారిగా తన తండ్రి ఇంటికి వెళ్లారు. సోమవారం ముంబైకి తిరిగి వచ్చిన నటాసా మంగళవారం నాడు తన కొడుకును మాజీ భ‌ర్త పాండ్యా ఇంటి వద్ద దింపింది. హార్దిక్ అత్త, పంఖురి శర్మ తన ఇన్‌స్టాలో ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

ఈ వీడియోలో హార్దిక్ అత్త అగస్త్యతో కొంత విలుమైన సమయాన్ని గడపడం కనిపించింది. ఆమె 4 ఏళ్ల పిల్లవాడితో క‌లిసి పుస్తకం చదువుతూ కనిపించింది. ఆమెతో పాటు బంధువు ఒకరు కూడా ఉన్నారు. హార్దిక్‌తో విడిపోయిన తర్వాత అగస్త్య తన తల్లి నటాసాతో కలిసి సెర్బియాలో నివసిస్తోంది. మే 2020లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఫిబ్రవరి 2023లో హిందూ- క్రిస్టియన్ ఆచారాల ప్రకారం తమ వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. కానీ క‌ల‌త‌ల‌తో జూలై 2024లో విడిపోవడాన్ని ధృవీకరించారు. వారు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. విడిపోతున్నాం.. కానీ కుమారుడు అగస్త్యకు సహ తల్లిదండ్రులుగా కొనసాగుతామ‌ని తెలిపారు.

హార్థిక్ వేగాన్ని న‌టాషా త‌ట్టుకోలేక‌పోయిందని టైమ్స్ న‌వ్ క‌థ‌నం రాసింది. హార్థిక్ మారకపోవడంతో ఆమె నిర్ణయం దృఢంగా మారింది. ఇది నటాసా తీసుకున్న చాలా బాధాకరమైన నిర్ణయం కానీ అది ఒక్క రోజు లేదా ఒక వారంలో రాలేదు. ఇది నెమ్మదిగా కానీ క్రమంగా గాయం ఆమెను బాధిస్తూనే ఉంది అని సోర్స్ తెలియ‌జేసిన‌ట్టు ఆ క‌థ‌నంలో రాసారు. గత నెలలో నటాసా సెర్బియాలో అగస్త్య పుట్టినరోజును సెల‌బ్రేట్ చేసింది. హార్దిక్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో అగ‌స్త్య వీడియోను షేర్ చేసాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ హార్థిక్ ఎమోష‌న‌ల్ అయ్యాడు.

Tags:    

Similar News