నాని కోపం ఒక్క నిమిషమే!
నానికి కోపం వచ్చినా ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. మరు నిమిషం ఆ కోపం కరిగి పోతుందిట. ఇలా కరిగి పోవడాన్ని తన బలహీనతగా చెప్పుకొచ్చాడు.
మనిషికి అన్ని రకాల ఎమోషన్ కన్నా అత్యంత ప్రమాదరకమైన ఎమోషన్ కోపం. అది వచ్చిన కొంత మందిలో పగ ప్రతీ కారాలతో రగిలి పోతుంటారు. మరికొంత మందిలో ఆ కోపం వెంటనే కరిగి పోతుంది. దీన్నే ముక్కు మీద కోపం..మూతి మీద కోపం అంటారు. మరి నేచురల్ స్టార్ నాని కోపం ఎలాంటింది అంటే? రెండో రకం అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రివీల్ చేసారు.
నానికి కోపం వచ్చినా ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. మరు నిమిషం ఆ కోపం కరిగి పోతుందిట. ఇలా కరిగి పోవడాన్ని తన బలహీనతగా చెప్పుకొచ్చాడు. ఎవరైనా హర్ట్ చేసినా ఆ క్షణం కోపం వచ్చినా? వెంటనే కొవ్వొత్తిలా కరిగిపోతుందన్నాడు. అంతేకానీ వాళ్లేదో అన్నారని...వాళ్ల మీద పగ పెంచుకోవడం..ప్రతీకారం తీర్చుకోవడం.. ఆ కోపాన్ని అలాగే కంటున్యూ చేయడం వంటివి ఉండవట.
ఇలా కోపం చల్లారపోవడం అన్నది కొంత మందిలో గొప్ప లక్షణంగా చెప్పొచ్చు. పగలు..ప్రతీకారాలతో సాధించేది ఏమీ ఉండదు. అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవడం తప్ప. నాని మనస్తత్వం అలాంటిందే. వెరీ కామ్ గోయింగ్ పర్సన్. ఎలాంటి వివాదాల్లో వేలు పెట్టడు. తన పని తాను చూసుకుని వెళ్లిపోతాడు. ఇతరుల విషయాల్లో వేలు పెట్టడు. జోవియల్ గా ఉంటాడు. నవ్వితే నవ్వుతాడు. పలకరిస్తే హాయ్ అంటాడు.
ఇంతకు మించి ఎదుట వారు ఆశించేది ఏముంటుంది? అందుకే నేచురల్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే 'సరిపోదా శనివారం'తో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. శ్రీకాంత్ ఓదెలతో ఇటీవలే మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఆ సినిమా షూటింగ్లోనే బిజీగా ఉన్నాడు.