నయన్-విఘ్నేష్‌కి ఆదిలోనే ఆటంకం
నయనతార-విఘ్నేష్ శివన్ జోడీ సొంత బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
నయనతార-విఘ్నేష్ శివన్ జోడీ సొంత బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జోడీ రౌడీ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న తదుపరి చిత్రానికి ఎల్ఐసి (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) అని పేరు పెట్టారు. నటుడు-దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ -కృతి శెట్టి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
బీమా మరియు పెట్టుబడి సంస్థ - లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) తాజాగా మూవీ టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. విఘ్నేష్ శివన్ - సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ సహా చిత్ర నిర్మాతలకు నోటీసు పంపడంతో ఇప్పుడు చిత్రం ఇబ్బందుల్లో పడింది. సినిమా కోసం టైటిల్‌ని ఉపయోగించకుండా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఏడు రోజుల్లోగా టైటిల్‌ను మార్చకపోతే కాపీరైట్ ఉల్లంఘన కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించింది. నోటీసుపై మేకర్స్ ఇంకా స్పందించలేదు మరియు దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఈ చిత్రానికి సెవెన్ స్క్రీన్ స్టూడియో - రౌడీ పిక్చర్స్ సహకారం అందించనున్నాయి. ముఖ్యంగా విఘ్నేష్ కి చెందిన రౌడీ పిక్చర్స్ -సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ గతంలో కాతువాకుల రెండు కాదల్ చిత్రం కోసం కలిసి పనిచేశాయి. ఇప్పుడు మరోసారి ఎల్.ఐ.సి కోసం కలిసి పని చేస్తున్నాయి. ఎల్‌ఐసికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో యోగి బాబు కమెడియన్‌గా నటించనున్నారు. సాంకేతిక బృందంలో ప్రదీప్ రాఘవ్ ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఉన్నారు.