వైరల్‌ వీడియో : పిల్లలతో లేడీ సూపర్‌ స్టార్‌ ఆటో..!

లేడీ సూపర్ స్టార్‌ ఒకప్పుడు కేవలం సినిమా విషయాలతో మాత్రమే వార్తల్లో ఉండేది.

Update: 2024-05-22 11:01 GMT

లేడీ సూపర్ స్టార్‌ ఒకప్పుడు కేవలం సినిమా విషయాలతో మాత్రమే వార్తల్లో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ మధ్య కాలంలో సినిమా వార్తలతో కంటే కూడా ఎక్కువగా తన పిల్లలకు సంబంధించిన విషయాలతో ఎక్కువగా నయనతార వార్తల్లో నిలుస్తున్న విషయం మనం చూస్తున్నాం.


తాజాగా మరోసారి నయనతార ఒక వీడియోను షేర్‌ చేసి వార్తల్లో నిలిచింది. తన పిల్లలతో ఆటోలో ప్రయాణిస్తున్న నయతార అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్‌ మీడియాలో ఈమె షేర్‌ చేసిన నయనతార వీడియో కు నెటిజన్స్ నుంచి భారీ స్పందన వచ్చింది.

లేడీ సూపర్ స్టార్‌ అయ్యి ఉండి తన పిల్లలతో కలిసి ఆటోలో ప్రయాణించడం అనేది ఆమె యొక్క సింప్లిసిటీ నిదర్శనం అన్నట్టు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈ అమ్మడు షేర్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతున్నాయి.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమిళంలో రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు తెలుగు లో కూడా ఈమె సినిమాలు చేస్తూ ఉంది. రాబోయే ఏడాది కాలంలో నయనతార నటించిన మూడు నాలుగు సినిమాలు అయినా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక నయనతార భర్త విఘ్నేష్ శివన్‌ కూడా దర్శకుడిగా మరియు నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న నయన్‌, విఘ్నేష్ శివన్‌ లు సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే.

Tags:    

Similar News