సూపర్‌స్టార్.. అంత‌క‌న్నా ముందు అమ్మ‌

ఎంత పెద్ద సూప‌ర్ స్టార్ అయినా ఒక అమ్మకు కూతురు. అమ్మ అయ్యాక స్టార్ డ‌మ్ కంటే అమ్మ‌త‌నమే ఎక్కువ‌.

Update: 2024-01-22 00:30 GMT

ఎంత పెద్ద సూప‌ర్ స్టార్ అయినా ఒక అమ్మకు కూతురు. అమ్మ అయ్యాక స్టార్ డ‌మ్ కంటే అమ్మ‌త‌నమే ఎక్కువ‌. మాతృత్వంలోని గొప్ప‌త‌నం అది. స‌రోగ‌సీ ద్వారా విఘ్నేష్ తో ఒక‌ బిడ్డ‌ను క‌న్న న‌య‌న‌తార త‌న బిడ్డ‌ను అపురూపంగా చూసుకుంటోంద‌న‌డానికి ఇదిగో ఇదే లైవ్ ఎగ్జాంపుల్.


న‌య‌న్ త‌న బిడ్డ ఉయిర్ ను చంక‌నెత్తుకుని ఇలా మురిపెంగా క‌నిపించింది. త‌న కుమారుడు అలా భుజంపై త‌ల‌ను ఆన్చి అమాయ‌కంగా నోట్లో వేళ్లు పెట్టుకుని ఏం ఆలోచిస్తున్నాడో కానీ, ఈ ఫోటోగ్రాఫ్ ని చూడ‌గానే క్యూట్ లవ్ లీ అంటూ అభిమానులు ల‌వ్ ఈమోజీల‌ను కురిపిస్తున్నారు.

ఒక చిన్న ముఖంలో దేవుడి దయ అంతా! అంటూ ఒక అభిమాని ల‌వ్ ఈమోజీని షేర్ చేసాడు. నల్ల వేల `రథమారే పొదల` ..అందమైన అమ్మ మరియు కొడుకు..! అంటూ ఒక అభిమాని వ్యాఖ్య‌ను జోడించాడు. ర‌థ‌మారే న‌య‌న్ సినిమాలోని పాట‌. దీనిని గుర్తు చేస్తూ అభిమానులు స‌ర‌దా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ అంద‌మైన ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..

నయనతార 75 వ చిత్రం `అన్నపూర్ణి` ఇటీవల విడుద‌లై విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌ధారి అన్నపూర్ణి (న‌య‌న‌తార‌)కి వంట చేయడంపై ఉన్న అభిరుచిని ఆవిష్క‌రిస్తుంది. అయితే క‌థానాయిక‌ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో మాంసాన్ని తినడం లేదా ముట్టుకోవడాన్ని స‌మ‌ర్థించే స‌న్నివేశంలో న‌టించ‌డంతో హిందువుల మ‌నోభావాల స‌మ‌స్య‌ను లేవనెత్తారు. కేసు న‌మోద‌వ్వ‌డంతో నెట్ ఫ్లిక్స్ నుంచి అన్న‌పూర్ణి సిరీస్ ని తొల‌గించారు. న‌య‌న్ త‌దుప‌రి టెస్ట్, థని ఒరువన్ 2, 1960 మన్నంగట్టి, కన్నప్ప చిత్రాలతో భారీ లైన‌ప్‌ని క‌లిగి ఉంది.

Tags:    

Similar News