షాకిచ్చిన నయనతార..ఇది ఊహించలేదే!
లేడీ సూపర్ స్టార్ నయనతార నెత్తిన ఎన్ని కోట్లు గుమ్మరిస్తామన్నా? సినిమా ప్రచారానికి మాత్రం హాజరు కాదన్నది జగమెరిగిన సత్యం.
లేడీ సూపర్ స్టార్ నయనతార నెత్తిన ఎన్ని కోట్లు గుమ్మరిస్తామన్నా? సినిమా ప్రచారానికి మాత్రం హాజరు కాదన్నది జగమెరిగిన సత్యం. దర్శక, నిర్మాతలలో అమ్మడి కమింట్ మెంట్ కేవలం షూటింగ్ పూర్త య్యేవరకే. ఆ తర్వాత తనకెలాంటి సంబంధం లేదని ముందే ఒప్పంద పత్రం రాయించుకుంటుంది. ప్రచారానికి అదనంగా కోట్లు ఇస్తామన్నా రానంటుంది. ఇక తన పక్కన ఎంత పెద్ద కోస్టార్ అయినా సరే ఇదే సమాధానం చెబుతుంది.
రజనీకాంత్ అయినా..మెగాస్టార్ చిరంజీవి అయినా..షారుక్ ఖాన్ తో నటించిన సినిమా అయినా సో వాట్? అని కుదరదనేస్తుంది. చాలా కాలంగా ఈ రూల్ పాటిస్తుంది. చివరికి తన సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ లోనూ ఇదే రూల్ పాటిస్తుంది. సినిమా కోసం కోట్లు ఖర్చు చేస్తుంది. కానీ రిలీజ్ కి ముందు మీడియా ముందుకొచ్చి ప్రచారం చేయదు. కొన్ని దశాబ్ధలుగా నయనతార జర్నీ ఇలాగే కొనసాగుతుంది. అయితే తాజాగా ఓ దర్శకుడి కోసం తన రూల్ ని, సరిహద్దుల్ని దాటేసి తొలిసారి ఓ సినిమా ప్రచారంలో పాల్గొంది.
ఇది నమ్మశక్యంగా లేకపోయినా నమ్మాల్సిన నిజమే. అవును ఇది నిజంగా జరిగింది. తమిళ దర్శకుడు విష్ణు వర్దన్ `నేసిప్పయ` అనే సినిమా తెరకెక్కించాడు. ఇందులో శంకర్ కుమార్తె అతిది హీరోయిన్ గా నటించింది. ఈసినిమాకి పెద్దగా బజ్ లేదు. అసలు ఇలాటి సినిమా ఒకటుందని కూడా చాలామందికి తెలియదు. అయితే ఈ సినిమా కోసం నయనతార నడుం బిగించింది. నేరుగా చిత్ర యూనిట్ తో కలిసి మీడియా ముందుకొచ్చి సినిమా గురించి ప్రచాం చేసింది.
అయితే నయనతార ఇలా చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. నయనతార హీరోయిన్ గా నటించిన `బిల్లా` సినిమాని తమిళ్ లో తెరకెక్కించింది విష్ణువర్దన్. ఆ సినిమా తర్వాత నయన్ కెరీర్ మారిపోయింది. స్టార్ హీరోయిన్ రేసులో చేరిపోయింది. అప్పటి నుంచి అమ్మడి కెరీరీకి తిరుగులేదు. ఆ విజయం తర్వాత పారితోషికం భారీగా పెంచేసింది. ఆ కృతజ్ఞతగా విష్ణు వర్దన్ కోసం ప్రచారంలో పాల్గొంది. అతడు తన కుటుంబ సభ్యుడు లాంటి వారని, అందుకే వచ్చానని తెలిపింది.