న‌య‌న్ ని లాక్ చేసిన మ‌హారాజ్!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా స‌త్తా చాట‌డానికి ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తుందో తెలిసిందే.

Update: 2024-07-02 09:03 GMT

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా స‌త్తా చాట‌డానికి ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తుందో తెలిసిందే. ఇప్ప‌టికే అమ్మ‌డు కొన్ని లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు చేసింది. కానీ అవేవి న‌య‌న‌తార సోలో ఇమేజ్ ని పెద్ద‌గా ప్రోజెక్ట్ చేయ‌లేదు. ఓవైపు క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తున్నా? న‌య‌న్ మ‌న‌సంతా లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌పైనే ఉంది. గ‌త ఏడాది ల్యాండ్ మార్క్ చిత్రంగా రిలీజ్ చేసిన 75వ సినిమా `అన్న‌పూర్ణి` కూడా స‌రైన ఫ‌లితం సాధించ లేదు. దీంతో న‌య‌న్ లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌పై మ‌రింత క‌సిగా ప‌నిచేస్తోంది.

ఇటీవ‌లే శ‌శి కుమార్ ని సైతం రంగంలోకి దించింది. అత‌డు మంచి స్టోరీ వినిపించ‌డంతో న‌టుడిగా ఉన్న శ‌షి కిర‌ణ్ ని డైరెక్ట‌ర్ గా ఎంపిక చేసుకుంది. అలాగే లోకేష్ క‌న‌గ‌రాజ్ శిష్యుడు విష్ణు అనే మ‌రో కొత్త కుర్రాడిని తెర‌పైకి తెచ్చింది. న‌య‌న్ ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని ఓ స్టోరీ వినిపించడం..అది ఆమెకి క‌నెక్ట్ అవ్వ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా ఛాన్స్ ఇచ్చింది. తాజాగా యువ ద‌ర్శ‌కుడు నితిల‌న్ సామినాధ‌న వినిపించి మ‌రో స్టోరీకి ఒకే చెప్పింద‌ని స‌మాచారం.

Read more!

ఇది కూడా పూర్తిగా లేడీ ఓరియేంటెడ్ నేప‌థ్యంలో సాగే చిత్రం కావ‌డంతో న‌య‌న్ మ‌రో ఆలోచ‌న లేకుండా క‌మిట్ అయిందిట‌. అయితే ఆ ఛాన్స్ సామినాధ‌న్ కి అంత ఈజీగా ఇవ్వ‌లేదు. స్టోరీకి సంబంధించి ఇద్ద‌రి మ‌ధ్య నాలుగు సిట్టింగ్ లు జ‌ర‌గ‌గా చివ‌రి సిట్టింగ్ లో ఒకే చేసిందిట‌. నిత‌ల‌న్ సామినాధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మ‌హారాజ్` ఇటీవ‌ల రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించించిన సంగ‌తి తెలిసిందే.

త‌మిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. దీంతో న‌య‌న‌తార కాన్పిడెంట్ గా అత‌డితో ముందుకెళ్లిపోవ‌చ్చు అని చెప్పొచ్చు. `మ‌హారాజ్` తో నితిల‌న్ మంచి సందేశాన్ని పాస్ చేసాడు. అతిగా డ‌బ్బు కోసం పాకులాడితే జీవితం ఎలా ముగుస్తుంది? అన్న‌ది క్లైమాక్స్ లో ఎంతో చ‌క్క‌గా వివ‌రించాడు.

Tags:    

Similar News

eac