NBK109: అసలు సమస్య ఏంటీ?
అభిమానులకి నిర్మాత నాగ వంశీ సారీ చెప్పేశారు. సీజీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో దీపావళికి టీజర్ రిలీజ్ చేయలేకపోతున్నట్లు చెప్పారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో 'NBK109' మూవీ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. బాలకృష్ణ స్టైల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఈ మూవీ ఉండబోతోంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొని రావాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ ని దీపావళి కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
కచ్చితంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఉంటుందని నిర్మాత నాగవంశీ చెప్పారు. అయితే ఇప్పుడు మరల దీనిపై ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అభిమానులకి నిర్మాత నాగ వంశీ సారీ చెప్పేశారు. సీజీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో దీపావళికి టీజర్ రిలీజ్ చేయలేకపోతున్నట్లు చెప్పారు. ఆలస్యం అయిన కూడా కచ్చితంగా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలా టీజర్ ని అందిస్తామని తెలిపారు. టెక్నీకల్ టీమ్ మొత్తం NBK109 మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉన్నారని తెలిపారు.
సగం సగం రిజల్ట్ తో టీజర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని డిజపాయింట్ చేయలేమని అన్నారు. దీంతో దీపావళికి 'NBK109' నుంచి ఎలాంటి అప్డేట్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒక వేళ ప్రేక్షకుల కోరిక మేరకు స్పెషల్ పోస్టర్ ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించాడు. ఊర్వశీ రౌతేలా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా చేశారు. చాందిని చౌదరి ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది.
ఆమె పాత్ర సినిమాలో చాలా బలంగా ఉంటుందని అనుకుంటున్నారు. ఇదిలా 'NBK109' సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసిన నేపథ్యంలో వీలైనంత వేగంగా మూవీ కంటెంట్ ని మార్కెట్ లోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. బాలయ్య 'అఖండ 2' ని రీసెంట్ గా స్టార్ట్ చేశారు. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు.
విజువల్ స్పెక్టక్యులర్ గా మూవీ ఉంటుందనే మాట వినిపిస్తోంది. 'NBK109' మూవీ సూపర్ హిట్ అయితే 'అఖండ 2' పైన అంచనాలు మరింత పెరుగుతాయని చెప్పొచ్చు. కచ్చితంగా ఆ సినిమాతో బాలయ్య వండర్స్ క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.