సింహం రంగంలోకి డేట్ ఫిక్సైంది!
నటసింహ బాలకృష్ణ మళ్లీ మ్యాకప్ ఎప్పుడేసుకుంటారా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూ స్తున్నారు.
నటసింహ బాలకృష్ణ మళ్లీ మ్యాకప్ ఎప్పుడేసుకుంటారా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూ స్తున్నారు. బాలయ్య సైతం సిద్దంగా ఉన్నా దర్శకుబు బాబి నుంచి గ్రీన్ సిగ్నెల్ రాకపోవడంతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడాయన కూడా గెట్ రెడీనా సర్ అనే సరికి బాలయ్య ఓ యస్ అంటూ రంగంలోకి దిగడానికి రెడీ అయిపోతున్నారు. ఏపీలో ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పూర్తయింది.
ఇక రాజకీయంగా చూసుకోవాల్సిన పనులలన్నింటిన వియ్యంకుడు చంద్రబాబు, అల్లుడు లోకేష్ చూసుకుంటారు. కాబట్టి ఇప్పట్లో బాలయ్య అవసరం కూడా లేదు. దీంతో సింహం షూటింగ్ కి రెడీ అవుతుంది. ఈనెలఖరునుంచి తిరిగి షూటింగ్ ప్రారంభించాలని యూనిట్ కి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. హైదరాబాద్ లో సిద్దం చేస్తున్న ప్రత్యేకమైన సెట్ లో ఈ షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
కొన్ని రోజులుగా ఆ సెట్ పనుల్లోనే టీమ్ పనిచేస్తుంది. ఈనెలఖరుకల్లా ఆపనులు పూర్తవుతాయి. అప్పటి నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేయడమే పని. ఈ షెడ్యూల్ లో బాలయ్యపై కీలక సన్నివేశాలు చిత్రీకరిం చనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే.
అయితే ఇంతవరకూ టైటిల్ ఏంటి? అన్నది బయటకు రాలేదు. ఎలాంటి టైటిల్ పెడతారు? అన్న దానిపైనా అభిమానుల్లో చర్చ సాగుతుంది. అలాగే బోయపాటి శ్రీను తో `అఖండ -2` కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్య డేట్లు ఇస్తే బోయపాటి రంగంలోకి దిగిపోతారు. పైగా ఈ చిత్రాన్ని బాలయ్య చిన్న కుమార్తె నిర్మిస్తుండటంతో ఎంతో ప్రత్యేకత ఉండలే చూస్తున్నారు.