ట్రోల్స్ కి భయపడి పెద్దాయన్ను కలిశాడా ?
రాఘవ లారెన్స్ తన మేనరిజాన్ని పక్కనపెట్టి.. సినిమాలో రజనీకాంత్ మేనరిజాన్ని కాపీ కొట్టారని, లుక్, గెటప్ అంతా మొదటి భాగంలోని రజనీ స్టైల్లాగే ఉందంటూ కామెంట్లు చేశారు.
రాఘవ లారెన్స్-కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బహుభాషా చిత్రం చంద్రముఖి 2. పి.వాసు దర్శకుడు. సూపర్ స్టార్ రజనీకాంత్ హిట్ సినిమా చంద్రముఖికి కొనసాగింపుగా ఇది రాబోతుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన రాఘవ లారెన్స్.. తన అభిమాన హీరో అయిన రజనీకాంత్ దగ్గరకు వెళ్లి ఆశిస్సులు తీసుకున్నారు. అయితే వాస్తవానికి ఈ చంద్రముఖి సీక్వెల్‌పై పెద్దగా బజ్ ఏమీ క్రియేట్ అవ్వలేదు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి కానీ.. ఆ తర్వాత పోస్టర్, ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు బాగా ట్రోల్స్ వచ్చాయి.
రాఘవ లారెన్స్ తన మేనరిజాన్ని పక్కనపెట్టి.. సినిమాలో రజనీకాంత్ మేనరిజాన్ని కాపీ కొట్టారని, లుక్, గెటప్ అంతా మొదటి భాగంలోని రజనీ స్టైల్లాగే ఉందంటూ కామెంట్లు చేశారు. ఇక ట్రైలర్ కూడా రిలీజయ్యాక కథ అచ్చం మొదటి భాగంలానే అనిపిస్తుందని, పెద్దగా ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదని అన్నారు. మొత్తంగా ఇలాంటి కారణాలతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవ్వలేదు.
అయినప్పటికీ లారెన్స్‌తో పాటు మిగతా టీమ్ మొత్తం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను గట్టిగానే చేస్తోంది. కథలో కొత్త దనం ఉంటుందని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే లారెన్స్.. రజనీకాంత్ వెళ్లి కలిసి ఆశిస్సులు తీసుకోవడం కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఎందుకంటే నెగటివ్ ట్రోల్స్ వస్తున్న సమయంలో.. లారెన్స్ ఇలా చేయడం ఆయన ఫ్యాన్స్‌తో పాటు మరీ ముఖ్యంగా రజనీ అభిమానులకు కాస్త పాజిటివిటీని క్రియేట్ చేసింది.
కాబట్టి అభిమానులు ఈ సినిమాను మరింత ఎక్కువ మంది చూసేందుకు ఈ సంఘటన కలిసొస్తుందనే చెప్పాలి. అదే సమయంలో సినిమా మొదటి రోజు కంటెంట్ పరంగా కాస్త మంచి టాక్ తెచ్చుకుంటే చాలు.. ఇక ఆటోమెటిక్‌గా మంచి వసూళ్లను ఎలాగో అందుకుంటుంది. చూడాలి మరి.. లారెన్స్.. రజనీని కలవడం.. ఎంతవరకు మొదటి రోజు అభిమానులను థియేటర్లకు తీసుకువస్తుందో.. అలాగే ఈ సీక్వెల్ కథ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో..