టిల్లు గాని గాళ్ వేడి మీద ఉందిలే
ఈ భామ క్యూట్ లుక్స్, మతి చెడే బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ యువతరానికి ఇప్పటికే కనెక్టయిపోయింది.
'డీజే టిల్లు' లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించింది నేహా శెట్టి. అంతకుముందు పూరి వారసుడితో 'రొమాంటిక్'లో నటించినా కానీ 'డీజే టిల్లు' విజయం గేమ్ ఛేంజర్ గా మారింది. నేహా రేంజును ఈ చిత్రం అమాంతం పెంచింది. అటుపై నేహా శెట్టి వరుస చిత్రాలకు సంతకాలు చేసింది. ఇటీవల 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఈ భామ క్యూట్ లుక్స్, మతి చెడే బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ యువతరానికి ఇప్పటికే కనెక్టయిపోయింది.
తాజాగా టిల్లు గాని బ్యూటీ లైట్ బ్లూ మినీ డ్రెస్ లో ఫోజులివ్వగా అవి ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. నీలిరంగు డిజైనర్ దుస్తుల్లో నేహా ఎంతో వేడిగా కనిపిస్తోంది. నేహా శెట్టి టోన్డ్ ఫిజిక్ కి సరిపడే డిజైనర్ లుక్ ఇది. మేకప్ లెస్ లుక్ లో శెట్టి ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. ఈ ఆకర్షణీయమైన ఫోటోషూట్ సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారుతోంది.
తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్‌కి నేహా అద్భుతమైన క్యాప్షన్‌ని ఇచ్చింది. ''కాంతులను పట్టుకోవడం.. రాత్రులను సొంతం చేసుకోవడం'' అంటూ రిథమిక్ గా శీర్షికను జోడించింది. నేపథ్యంలో పబ్ వాతావరణం చూస్తుంటే ఎంతో చిల్లింగ్ గా కనిపిస్తోంది. యువనటి స్పీడ్ కి తగ్గట్టుగా ఈ ఫోటోషూట్ అద్భుతంగా కుదిరింది. టిల్లు గాని గాళ్ వేడి మీద ఉందిలే అంటూ అభిమానులు దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు.
కన్నడలో మళ్లీ స్పీడ్ :
నేహా శెట్టి టాలీవుడ్ తో పాటు శాండల్‌వుడ్ లోను పాపులర్ కథానాయిక. ఇప్పటికే పలు కన్నడ చిత్రాల్లోను ఈ బ్యూటీ నటించింది. తాజా కథనాల ప్రకారం.. నేహా శెట్టి దర్శకనటుడు, 'కాంతార' ఫేం రిషబ్ శెట్టితో కలిసి నటించనుందని గుసగుస వినిపిస్తోంది. ఇంతకుముందు ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టితో కలిసి పనిచేయాలని ఆత్రంగా ఉన్నానని వ్యాఖ్యానించింది. రిషబ్ శెట్టి కాంతారా చిత్రాన్ని తాను వందల సార్లు చూశానని కూడా వెల్లడించింది. ఇంతలోనే శెట్టి తన తదుపరి చిత్రానికి ఈ బ్యూటీని ఎంపిక చేయనున్నారని గుసగుస వినిపిస్తోంది.