లింగ వివక్షపై శివంగిలా చిరుత పిల్ల!
ఇండస్ట్రీలో లింగ వివక్ష కొనసాగుతుందంటూ కంగన అయితే సందు దొరికనప్పుడల్లా చెడుగుడు ఆడేసేది.
బాలీవుడ్ మేల్ డామినేటెడె ఇండస్ట్రీ అంటూ ఎంతో మంది భామలు నిప్పులు చెరిగిన సందర్భాలెన్నో. హీరోలతో తామెందుకు సమానం కాదో చెప్పాలంటూ ఎన్నోసార్లు డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అవకాశాలు అందుకోవడం లోగానీ, పారితోషికం తీసుకోవడం లోగానీ! మార్కెట్ పరంగా గానీ హీరోలకు ధీటుగా తాము పనిచేయలేమా? అని ఎంతో మంది భామలు గొంతెత్తారు. కంగనా రనౌత్, దీపిక పదుకొణే, కరీనా కపూర్, విద్యాబాలన్ లాంటి వాళ్లు ఈ అంశంపై ఓపెన్ చాలా సందర్భాల్లో మాట్లాడారు.
ఇండస్ట్రీలో లింగ వివక్ష కొనసాగుతుందంటూ కంగన అయితే సందు దొరికనప్పుడల్లా చెడుగుడు ఆడేసేది. తాజాగా నేహాశర్మ కూడా లింగ వివక్షపై స్పందించింది. ఈ వివక్ష కారణంగా తనలాంటి వారు ఎంతో మంది అవకాశాలు లేకుండా ఖాళీగా ఉండాల్సి వస్తొందని ఆవేదన వ్యక్తం చేసింది. `చాలా మంది అవకాశాలు పొందాలంటే రాజీ పడాలి అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారని..మహిళ అయితే ఇంతలా దిగజరాలా? అని మండి పడింది. మగ హీరోలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక అసలు కారణం ఏంటి? మహిళా నటులకు ద్వితియ స్థానం కల్పించడం ఏంటి? మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
అయినా అన్ని రంగాల్లో ఇంకా ఈ రకమైన వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇదొక సామాజిక సమస్యలా తయారైంది. ముఖ్యంగా కళారంగంలో రాజీ అనే మాట తరుచూ వినిపిస్తుంది. వందలో 80 శాతం మహిళల పట్ల అలాంటి ప్రవర్తనే కనిపిస్తుంది. అన్ని రంగాలలో మహిళలకు మరింత అవగాహన , మద్దతు ఇవ్వాలి. మహిళల సహకారం యొక్క విలువను గుర్తించాలి. మరింత సమగ్ర వాతావరణాన్ని సృష్టించాలి.
ఈ విషయంలో ప్రజలందరి నుంచి కూడా మద్దతు అవసరం. బాలీవుడ్ లో అసమానత అనే సంకెళ్ల నుంచి మహిళలంతా విముక్తి పొందాలి` అని అంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. నేహా శర్మ ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తొలిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో శివంగిలా చేలరేగిందేంటి? అని చర్చించుకుంటన్నారు.