రాధికా అని పిలిస్తే ఆ రేంజ్ లో ఫీలవుతుందా?
ఆమె అసలు పేరు కన్నా రాధిక పేరుతోనే ఎక్కువగా గుర్తుపుడుతున్నారు. అంత బలంగా ఆ రోల్ జనాల్లోకి వెళ్లిపోయింది.
'డీజేటిల్లు' తో నేహాశెట్టి ఒక్కసారిగా ఏ రేంజ్ లో పాపులర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. రాధిక పాత్రతో తెలుగు రాష్ట్రాల యువత గుండెల్లో కలల రాణిగా మారిపోయింది. ఒక్క పాత్ర ఆమె స్థాయినే మార్చేసింది. అప్పటివరకూ ఎన్నో ప్రయోగాలు చేసింది కానీ ఏ సినిమా తీసుకురాని గుర్తింపు రాధిక అక్క పాత్ర తీసుకొచ్చింది. ఆమె అసలు పేరు కన్నా రాధిక పేరుతోనే ఎక్కువగా గుర్తుపుడుతున్నారు. అంత బలంగా ఆ రోల్ జనాల్లోకి వెళ్లిపోయింది.
'టిల్లు స్క్వేర్' లో సైతం క్లైమాక్స్ లో కనిపించిందంటే? ఆ పాత్రకున్న డిమాండ్ తోనే సాధ్యమైంది. ఇంకా డీజేటిల్లు నుంచి ఆరేడు సినిమాలైనా రావడానికి అవకాశం ఉంది. వాటన్నింటిలోనూ నేహాశెట్టి రోల్ ని ఎక్కడో ఓచోట తప్పకుండా చూపిస్తాడు సిద్దుబాబు అన్నది అభిమానుల నమ్మకం. నేహా శెట్టి బయట ఎక్కడా కనిపించినా రాధిక..రాధిక అక్క అనే పిలుస్తున్నారుట. మరి అలా పిలుస్తుంటే ఎలా ఉంది? పాజిటివ్ గా తీసుకుంటున్నారా? మరైదైనా ఫీలింగ్ ఉందా? అంటే నేహాశెట్టి ఎంతో ఉత్సాహంగా స్పందించింది.
'షారుక్ ఖాన్ ని అభిమానులు బాద్ షా అని పిలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో..నన్ను రాధిక అని పిలిస్తే అదే అనభూతి కలుగుతుందని' తెలిపింది. ఇంకా చెప్పాలంటే షారుక్ ఖాన్ కంటే ఎక్కువగా ఆనందపడతానని చెప్పుకొచ్చింది. అలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తాయని..అందులో నటించడం తన అదృష్టంగా చెప్పుకొచ్చింది. ఆ సినిమా తర్వాత నేహాశెట్టి టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఈ సినిమా విజయం తర్వాత నాలుగు సినిమాలు చేసింది. అందులో ఒకటి రిలీజ్ కావాల్సి ఉంది. డీజేటిల్లు కు ముందు మూడు సినిమాలు చేసింది. వాటిలో ఏవీ సక్సెస్ కాలేదు. కానీ రాధిక ఇంపాక్ట్ తో మాత్రం ఎన్నో కొత్త అవకాకాశాలు అందుకుంటోంది. నిర్మాతలకు అందుబాటులోనూ ఉంటుంది. యంగ్ హీరోలకు పర్పెక్ట్ ఛాయిస్ గానూ కనిపిస్తుంది. అదీ నేడు మార్కెట్ లో అక్క రేంజ్.