నెట్ ఫ్లిక్స్.. టాప్ లో మనోళ్ళే..
థియేటర్స్ ఆడియన్స్ క్రమంగా తగ్గుతూ ఉంటే ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ లని వీక్షించే వారి సంఖ్యలో పెరుగుతూ పోతోంది.
డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ హవా ప్రస్తుతం దేశంలో నడుస్తోంది. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు థియేటర్స్ కంటే ఓటీటీ ఛానల్స్ లో ఇంట్లో కూర్చొని సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడటానికి ఇష్టపడుతున్నారు. థియేటర్స్ ఆడియన్స్ క్రమంగా తగ్గుతూ ఉంటే ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ లని వీక్షించే వారి సంఖ్యలో పెరుగుతూ పోతోంది.
వరల్డ్ టాప్ ఓటీటీ ఛానల్ నెట్ ఫ్లిక్స్ గత ఏడాది అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు ఎనౌన్స్ చేసింది. వీటిలో ఇండియన్ కంటెంట్ నెంబర్ వన్ స్థానంలో ఉండటం విశేషం. గత ఏడాది జులై నుంచి డిసెంబర్ వరకు వచ్చిన వ్యూస్ ని నెట్ ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది. ఇందులో ఇండియన్ కంటెంట్ కి ఏకంగా వన్ బిలియన్ వ్యూస్ రావడం విశేషం.
వరల్డ్ వైడ్ గా 2023 సెకండ్ హాఫ్ లో 90 బిలియన్ గంటల కంటెంట్ ని పబ్లిక్ వీక్షించారని నెట్ ఫ్లిక్స్ పేర్కొంది. అందులో అత్యధిక వ్యూస్ ని హాలీవుడ్ మూవీ లీవ్ ది వరల్డ్ బిహైండ్ దక్కించుకుంది. దీనిని ఏకంగా 121 మిలియన్స్ మంది నెట్ ఫ్లిక్స్ లో వీక్షించారు. వెబ్ సిరీస్ లలో 72 మిలియన్ వ్యూస్ తో వన్ పీస్ టాప్ లో ఉంది. ఇక ఇండియన్ కంటెంట్ కి వస్తే కరీనా కపూర్ మిస్టరీ థ్రిల్లర్ జానేజాన్ 20.2 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉంది.
16.2 మిలియన్ వ్యూస్ తో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ రెండో స్థానంలో నిలిచింది. విశాల్ భరద్వాజ్ నటించిన ఖుషియా 12.1 మిలియన్ వ్యూస్ తో టాప్ 3లో ఉండటం విశేషం. ఇవే కాకుండా అక్షయ్ కుమార్ ఓఎంజీ2, తమన్నా, మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్న లస్ట్ స్టోరీస్ 2, డ్రీమ్ గర్ల్ 2 టాప్ వ్యూస్ ని దక్కించుకున్నాయి.
భోపాల్ గ్యాస్ సంఘటన ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ది రైల్వే మెన్ వెబ్ సిరీస్ 10.1 మిలియన్ వ్యూస్ ని సాధించడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇండియాలోనే ఓటీటీలలో కంటెంట్ కి విపరీతమైన ఆదరణ లభిస్తోందని నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ బట్టి అర్ధమవుతోంది. ఒక్క నెట్ ఫ్లిక్స్ లోనే 1 బిలియన్ వ్యూస్ ని ఇండియన్ సినిమాలు, వెబ్ సిరీస్ లు సాధిస్తే మిగిలిన ఛానల్స్ లో ఇక ఏ స్థాయిలో ఉంటాయో అంచనా వేసుకోవచ్చు.