మళ్లీ నెటిజెన్లకు బుక్కైన ఆ సినిమా..!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఇండియన్ 2.

Update: 2024-08-10 06:46 GMT

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఇండియన్ 2. ఈ సినిమాను దాదాపు మూడు నాలుగేళ్లు తెరకెక్కించారు. ఐతే శంకర్ సినిమాల విషయంలో రిజల్ట్స్ అన్ని కూడా గెస్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఒకప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్లు కొట్టిన శంకర్ ఈమధ్య ఆయన ట్రాక్ తప్పారు. శంకర్ సినిమా అంటే అంచనాలను సంగతి అటుంచితే ఈ సినిమా ఏమవుతుందో అన్న పరిస్థితి ఏర్పడింది.

అందుకు తగినట్టుగానే కమల్ తో ఇండియన్ 2 సినిమా రిజల్ట్ ప్రూవ్ చేసింది. ఒక సూపర్ హిట్ సినిమా సీక్వెల్ ని ఎంత కిచిడి చేయాలో అంతా చేశారు. ఈ సినిమా ఈమధ్యనే థియేట్రికల్ రిలీజై డిజాస్టర్ గా నిలిచింది. సినిమా చూసిన కమల్ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఐతే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది. థియేట్రికల్ రిలీజ్ టైంలోనే విపరీతమైన ట్రోలింగ్ కు గురైన ఇండియన్ 2 సినిమా ఓటీటీ రిలీజ్ అయ్యాక ఆ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది.

కమల్ హాసన్ శంకర్ కాంబోకి ఉన్న క్రేజ్ ని ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేసింది ఇండియన్ 2. ఈ సినిమా ఓటీటీలో కొన్ని సీన్స్ ను పెడుతూ శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు. ఐతే ఈ రేంజ్ టార్గెట్ శంకర్ లాంటి డైరెక్టర్ మీద జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఐతే ఈ సినిమా ఎఫెక్ట్ నెక్స్ట్ శంకర్ చేస్తున్న గేమ్ చేంజర్ మీద పడుతుందా అన్న భయం మెగా ఫ్యాన్స్ లో ఉంది. ఇండియన్ 2 థియేట్రికల్ రిలీజ్ టైం లోనే మెగా ఫ్యాన్స్ బాబోయ్ అని భయపడిపోగా ఇప్పుడు ఓటీటీలో సినిమాను ఆడుకుంటున్న తీరు చూసి గేమ్ చేంజర్ ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నారు.

ఐతే శంకర్ కెరీర్ లో ఒక డిజాస్టర్ పడ్డ ప్రతిసారి ఒక సూపర్ హిట్ ఇచ్చాడు. కాబట్టి ఇండియన్ 2 సినిమా ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడే ఛాన్స్ లేదు. అంతేకాదు గేమ్ చేంజర్ కొత్త కథతో వస్తుంది. ఆ సినిమా నిర్మాత దిల్ రాజు కాబట్టి ఆయన కచ్చితంగా కథ విషయంలో జాగ్రత్త పడతారని చెప్పొచ్చు. ఏది ఏమైనా గేమ్ చేంజర్ సినిమా వచ్చే దాకా మెగా ఫ్యాన్స్ లో ఈ టెన్షన్ అలానే కొనసాగే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News