రాజాసాబ్ లేకుండానే షూట్..!
కానీ కల్కి సినిమాకు పార్లమెంట్ ఎన్నికలు అడ్డువచ్చాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ హిట్ తర్వాత ఫుల్ జోష్ తో ఉన్నాడు. మే లో కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనుకున్నారు అంతా. కానీ కల్కి సినిమాకు పార్లమెంట్ ఎన్నికలు అడ్డువచ్చాయి. దాంతో సినిమా విడుదల దాదాపుగా వాయిదా పడ్డట్లే.
కల్కి తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా లో ప్రభాస్ లోని కొత్త యాంగిల్ ను చూడబోతున్నట్లుగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉన్నారు. రాజాసాబ్ షూటింగ్ చాలా స్లోగా సాగుతోంది.
ప్రభాస్ ఇతర సినిమాల కమిట్మెంట్స్ కారణంగా రాజసాబ్ కి చాలా తక్కువ డేట్లు ఇస్తున్నాడు. ఆ కారణంగానే షూటింగ్ ఈ ఏడాది అంతా కూడా పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా రాజాసాబ్ కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు.
హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సంజయ్ దత్ తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. కానీ ఈ షెడ్యూల్ లో రాజాసాబ్ ప్రభాస్ మాత్రం పాల్గొనడం లేదు అంటూ యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
ఈనెల నాల్గవ వారంలో రాజాసాబ్ కొత్త షెడ్యూల్ ప్రారంభం అవ్వబోతుంది. ఆ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొంటాడు. ఏప్రిల్ రెండో వారం వరకు రాజా సాబ్ కోసం ప్రభాస్ డేట్లు కేటాయించాడని తెలుస్తోంది. మరో వైపు సలార్ 2 మరియు స్పిరిట్ సినిమాలు కూడా మొదలు అవ్వాల్సి ఉంది.
ఇన్ని సినిమాలు లైన్ లో ఉండగా ఇటీవలే హనురాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా కి కమిట్ అయ్యాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా ఇటీవలే మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ కి రాబోయే రెండేళ్ల పాటు పండగే పండగ అన్నట్లుగా సినిమాలు ఉండబోతున్నాయి.