టాలీవుడ్ లో నయా ట్రెండ్.. హీరోలుగా అంకుల్స్
కమర్షియల్ విషయాలు పక్కన పెడితే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు తెగ వార్తల్లో నిలుస్తున్నాయి.
టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు నయా ట్రెండ్ ను మనం చూస్తూ ఉంటాం. మొన్నటి వరకు స్టార్ హీరోల హవా కొనసాగింది. ఈమధ్య కాలంలో చిన్న హీరోల సినిమాలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు సందడి చేస్తున్నాయి. కమర్షియల్ విషయాలు పక్కన పెడితే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు తెగ వార్తల్లో నిలుస్తున్నాయి.
కమెడియన్స్ హీరోలుగా మారి నటించిన సినిమాలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా నటించిన సినిమాలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు.. ఇలా అన్ని రకాల సినిమాలకు ప్రేక్షకుల నుంచి అప్పుడప్పుడు మంచి స్పందన వస్తుంది. దాంతో స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తే హిట్ ఖాయం అని అంతా నమ్ముతున్నారు.
అందులో భాగంగానే కాస్త చిన్న బడ్జెట్ లో సినిమాలను నిర్మించేందుకు దర్శక నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. అందులో నటీనటుల విషయంలో కాస్త శ్రద్ద పెట్టి ఎక్కువగా కాన్సెప్ట్ మరియు పబ్లిసిటీ విషయమై దృష్టి పెడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి.
అజయ్ ఘోష్, రావు రమేష్ తో పాటు మరి కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రల్లో సినిమాలు చేస్తున్నారు. హీరోలకు, హీరోయిన్స్ కు తండ్రి పాత్రల్లో లేదా అంకుల్ పాత్రల్లో నటించిన వీరు ఇప్పుడు ప్రధాన పాత్రల్లో నటించడం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
హీరో పాత్ర కంటే ముఖ్యంగా సినిమా కథ మరియు కాన్సెప్ట్ ను చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమాలు ఎక్కుతున్నారు. కనుక ముందు ముందు సీనియర్ నటులు మరింత మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.