భార్య‌ను భ‌ర్త‌ ఇలా కూడా ప్ర‌శంసించొచ్చా నిక్?

అదంతా అటుంచితే ప్రియాంక చోప్రా కాలి సౌంద‌ర్యాన్ని థై సొగ‌సుల్ని ఆవిష్క‌రిస్తూ నిక్ ఇప్పుడు షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో హాట్ డిబేట్ కి తావిచ్చిం

Update: 2024-06-08 12:30 GMT

భార్య ఘ‌న‌కార్యాన్ని భ‌ర్త కొనియాడ‌టం అంటే ఇదేనేమో! ఇదిగో ఇక్క‌డ షేర్ చేసిన ఈ హా* ఫోటోని ప్ర‌ద‌ర్శించిన నిక్ జోనాస్.. 'భార్య‌కు ప్ర‌శంస‌ల పోస్ట్' అనే అంద‌మైన‌ ట్యాగ్ ఇచ్చాడు. నిజ‌మే... ప్రియాంక చోప్రా ఒక ల‌క్కీ గాళ్‌! అని పొగిడేయాలో ఈ బోల్డ్ ప్ర‌శంస‌ను ఏమ‌నాలో అర్థం కాని ప‌రిస్థితి. నిక్ జోనాస్- ప్రియాంక చోప్రా జంట న‌డుమ బోల్డ్ నెస్ గురించి కానీ ఆప్యాయ‌త‌ల గురించి కానీ సందేహించాల్సిన పని లేదు.

ఓవైపు నిక్ జోనాస్ సోద‌రుడు జో జోనాస్- సోఫీ ట‌ర్న‌ర్ కాపురంలో క‌ల‌త‌లు మొద‌లైనా కానీ, నిక్ - పీసీ జంట ప్ర‌జ‌ల ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉన్నారు. నిక్ కుటుంబ స‌భ్యులంతా పీసీని చూసి నేర్చుకోవాల‌ని సోఫీకి సూచించార‌ని, భార‌తీయ‌త‌లోని స్వ‌చ్ఛ‌త‌, సాంప్ర‌దాయం సంస్కృతిల‌ను పొగిడేయ‌డంతోనే సోఫీకి కాలింద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి.

అదంతా అటుంచితే ప్రియాంక చోప్రా కాలి సౌంద‌ర్యాన్ని థై సొగ‌సుల్ని ఆవిష్క‌రిస్తూ నిక్ ఇప్పుడు షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో హాట్ డిబేట్ కి తావిచ్చింది. ప్రియాంక చోప్రా ఈ ఫోటోగ్రాఫ్ లో స్ట్రైకింగ్ ఫోజ్ తో కట్టి ప‌డేసింది. అంద‌మైన పొడుగ కాళ్ల సౌంద‌ర్యాన్ని పీసీ ఆవిష్క‌రించిన తీరు ఆక‌ర్షించింది. వీట‌న్నిటినీ మించి పీసీ టూ యంగ్ గా క‌నిపించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్రియాంక చోప్రా ది బ్లఫ్ షూటింగ్ కోసం ఆస్ట్రేలియాలో ఉంది. షూటింగుల సమయంలో ఆమె కూతురు మాల్తీ మేరీ కూడా స్పాట్‌లోనే ఉంటోంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కుమార్తె విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త వ‌హిస్తోంది. బాలీవుడ్ లో క‌త్రినా కైఫ్, అలియా భట్ ల‌తో క‌లిసి పీసీ భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తోంది. ఫర్హాన్ అక్తర్ తెర‌కెక్కిస్తున్న‌ 'జీ లే జరా' త్వ‌రలోనే ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. నిక్ జోనాస్ త‌దుప‌రి 'ది గుడ్ హాఫ్‌'లో కనిపించనుంద‌ని స‌మాచారం. ఇది ఒక అమెరికన్ కామెడీ-డ్రామా. ఇందులో బ్రిటనీ స్నో కూడా నటించింది.

Tags:    

Similar News