వావ్.. ట్రెండీ లుక్‌లో నిహారిక
ఈ బోల్డ్ లుక్‌లో నిహారిక తన స్టైల్ ను, తన శైలి వైవిధ్యాన్ని చూపించడంతో పాటు సొగసును మరింతగా హైలైట్ చేసింది.
మెగా ఫ్యామిలీకి చెందిన అందాల నటి నిహారిక కొణిదెల తన ప్రతి ఫోటోషూట్‌తోనూ కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ను సృష్టిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఆమె డిఫరెంట్ స్టైల్‌తో కనిపించింది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గౌన్‌లో నిహారిక ఆకట్టుకునేలా ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. "జస్ట్ లివింగ్" అని క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోస్ నెటిజన్ల హృదయాలను దోచుకుంటున్నాయి.
ఈ లేటెస్ట్ ఫోటోషూట్‌లో నిహారిక తన సింప్లిసిటీతో పాటు ఎలిగెన్స్‌ను కూడా మిళితం చేసింది. ఆరెంజ్ బ్యాక్‌డ్రాప్‌లో నల్ల, గులాబీ రంగు మిశ్రమం గల డ్రెస్‌లో ఆమె అందం మరింత పెరిగింది. ఈ బోల్డ్ లుక్‌లో నిహారిక తన స్టైల్ ను, తన శైలి వైవిధ్యాన్ని చూపించడంతో పాటు సొగసును మరింతగా హైలైట్ చేసింది. ఇటీవల నిహారిక తన కెరీర్‌లో కొత్త ప్రయోగాలు చేస్తూ వెబ్ సిరీస్‌లతో పాటు పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.
నిర్మాతగా కూడా రాణిస్తూ ప్రేక్షకుల అభినందనలను అందుకుంది. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ద్వారా పలు ప్రాజెక్టులు నిర్మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందులో భాగంగానే ఇటీవల విడుదలైన "కమిటీ కుర్రోళ్ళు" అనే సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. నిర్మాతగా మాత్రమే కాకుండా, నటిగా కూడా తన ప్రత్యేకతను చాటుకుంటూ తాను స్పెషల్ అని గుర్తింపు తెచ్చుకుంది.
ఈ ఫోటోషూట్‌తో నిహారిక అందం కొత్త కోణంలో అభిమానులకు అద్దం పట్టింది. తన లెగ్స్ అందంతో, స్టైలిష్ లుక్‌తో నిహారిక తన ఫ్యాషన్ సెన్స్‌ను మరోసారి ప్రదర్శించింది. ఈ ఫోటోషూట్ ద్వారా ఆమె అందం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నిహారిక అభిమానులు ఆమెను “మెగా ఫ్యామిలీ క్యూట్ అండ్ స్టైలిష్ డాటర్” అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఆమె వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. మరి రానున్న రోజుల్లో అమ్మడు సరికొత్తగా రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.