నిహారిక కూల్ గా గోళ్లు గిల్లుకుంటూ అలా!
మెగా ప్రిన్సెస్ నిహారిక మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుతోన్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ లు..సినిమాలు అంటూ కెరీర్ ని బిజీగా మలుస్తుంది
మెగా ప్రిన్సెస్ నిహారిక మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుతోన్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ లు..సినిమాలు అంటూ కెరీర్ ని బిజీగా మలుస్తుంది. ఈ రకమైన బిజీ నిహారికకు సెకెండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. పెళ్లికి ముందు కొన్ని సినిమాలు చేసిన నిహారిక అటుపై వివాహం తర్వాత కొన్నాళ్లు దూరంగా ఉంది. మళ్లీ ఇప్పుడు బిజీ అవుతోన్న తీరు చూస్తుంటే ఈసారి మరింత సీరియస్ గాకెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీ హీరోల మార్కెట్ కూడా ఇప్పుడిప్పుడే రెట్టింపు అవుతుంది. చరణ్..వరుణ్ తేజ్ లను పక్కనెబడితే ఆ తర్వాత స్టార్లు అయిన సాయితేజ్..వైష్ణవ్ తేజ్ లాంటి సక్సెస్ అవ్వడంతో! మెగా సంస్థలో నిర్మాతల అవసరం కూడా ఏర్పడుతుంది. చరణ్ సొంత నిర్మాణ సంస్థలో అగ్ర హీరోలతోనూ.. చిరంజీవి తోనూ తప్ప ఇంకే హీరోతో సినిమాలు నిర్మించలేదు. కొణిదెల బ్యానర్ అనేది కేవలం కొంత మంది హీరోలకే పరిమితం చేసారు.
ఈ నేపథ్యంలో సుస్మిత కొణిదెల కూడా సొంతంగా బ్యానర్ స్థాపించి తండ్రితో ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇదే తరహాలో నిహారిక కూడా నిర్మాణం రంగంలో రాణించే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రీకి బాగా పరిచయస్తురాలే. వెనుక తండ్రి సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. ఇంట్లోనే హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్లతో సినిమా లు చేసుకున్నా లైఫ్ కూల్ గా సాగిపోతుంది. అప్పుడప్పుడు మ్యాకప్ వేసుకుని కెమెరా ముందుకొచ్చి ఆ రకమైన ఫ్యాషన్ కూడా నిరూపించుకోవచ్చు.
అంతకు మించి కావాల్సిందే ముంటుంది. ఇక సోషల్ మీడియాలో నిహారిక యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పడు కొత్త ఫోటోలతో తనని ఎలా ఆవిష్కరించుకోవాలో తెలిసిన బ్యూటీ. డిజైనర్ దుస్తుల్లో తనదైన మార్క్ వేస్తుంది. తాజాగా జీన్స్ స్కర్ట్ లో... పింక్ వర్ణం టైట్ ఫిట్ లో నిహారిక జిగేల్ అని మెరుస్తోంది. కూల్ గా గోళ్లు గిల్లుకుంటూ గోడపై లా వాలింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.