మరోసారి క్రేజీ కాంబినేషన్ సెట్టవుతోందా?
బాలీవుడ్ సంచలన దర్శకుడు నితిష్ తివారీ ఇతిహాసం రామాయణం ఆధారంగా 'రామాయణ్' ని తెరకెక్కి స్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే
బాలీవుడ్ సంచలన దర్శకుడు నితిష్ తివారీ ఇతిహాసం రామాయణం ఆధారంగా 'రామాయణ్' ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రకటన రెండేళ్లు అవుతుంది. ఇటీవలే మరోసారి నితీష్ కన్పర్మేషన్ సైతం ఇచ్చేసారు. అప్పటి నుంచి సినిమా ఇంకా ఆదశలోనే ఉంది. ఇక రాముడి పాత్రలో రణబీర్ కపూర్..సీత పాత్రలో సాయి పల్లవి ..హనుమంతుడి పాత్రలో దేవ్ దత్తా..రావణుడి పాత్రలో యశ్ నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
దాదాపు ఆ పాత్రల వరకూ ఎంపిక కూడా పూర్తయిందని గట్టిగానే వినిపిస్తుంది. ఇంకా రామయణ్ కోసం చాలా మంది నటీనటుల్ని తీసుకోవాలి. రామాయణంలో ఇంకా బలమైన పాత్రలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ పాత్రల్లో ఫలానా నటులు నటిస్తున్నారంట? అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కుంభకర్ణుడి పాత్రలో బాడి డియోల్ నటిస్తున్నట్లు కొత్త వార్త తెరపైకి వస్తోంది.
అలాగే కైకేయి పాత్రలో లారా దత్తా కనిపించనున్నారనే ప్రచారం మొదలైంది. అయితే ఇందులో వాస్తవం ఎంత? అన్నది తెలియదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉందని భావించాలి తప్ప! షూట్ కి ఎప్పుడు వెళ్తుంది? అన్నది క్లారిటీ లేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి బాబి డియోల్ పేరు తెరపైకి రావడం ఆసక్తి సంతరించుకుంది. ఎందుకంటే యానిమల్ లో రణబీర్-బాబి డియోల్ పాత్రలు ఎంత గొప్పగా పండాయన్నది చెప్పాల్సిన పనిలేదు.
ఇద్దరి మధ్య సన్నివేశాలు తక్కువగా ఉన్న అవి ఎంతో బలంగా ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్ మరోసారి తెరను పంచుకుంటుంది అన్న వార్త ఆసక్తికరంగా మారింది. అదే నిజమైతే అభిమానులకు మరోసారి పండగ వచ్చినట్లే. పైగా ఇతిహాసం లాంటి సినిమాలో అలాంటి నటులు నటిస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.