కల్కి.. అంతకుమించి మరో ఆరు!

ఈ విషయాన్ని కల్కి మూవీ ప్రొడక్షన్ డిజైన్ నితిన్ జియాన్ చౌదరి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Update: 2024-07-21 09:50 GMT

కల్కి 2898ఏడీ సినిమాలో కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ లో పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా నటించారు. సుప్రీమ్ యాస్కిన్ కి పైన కలి క్యారెక్టర్ ఉంటుందంట. అతనికి దూతగా సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ ని ఆయన క్యారెక్టర్ నాగ్ అశ్విన్ డిజైన్ చేసారని తెలుస్తోంది. కల్కి సినిమాలో సుప్రీం యాస్కిన్ కంప్లెక్స్ అనే ప్రాంతంలో ఉంటారు. అలాగే డబ్బున్నవారందరూ కూడా భూమిని వదిలేసి కంప్లెక్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు. భైరవ క్యారెక్టర్ చేసిన ప్రభాస్ కూడా కంప్లెక్స్ లోకి వెళ్లిపోవాలని అనుకుంటాడు.

కల్కి సినిమాలో నాగ్ అశ్విన్ కాశి, శంబాల, కంప్లెక్స్ అనే మూడు ప్రాంతాలని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ మూడింటిలోనే కథ మొత్తం నడుస్తుంది. అయితే కంప్లెక్స్ అనేవి ఈ ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో మొత్తం ఏడింటిని మూవీ కోసం నాగ్ అశ్విన్ డిజైన్ చేసారంట. ఈ ఏడు కంప్లెక్స్ లని సుప్రీమ్ యాస్కిన్ లీడ్ చేస్తూ ఉంటాడంట. సుప్రీమ్ యాస్కిన్ డైరెక్ట్ గా అదృశ్య రూపంలో ఉండే కలికి సమస్త సమాచారం చేరవేస్తూ ఉంటాడంట.

ఈ విషయాన్ని కల్కి మూవీ ప్రొడక్షన్ డిజైన్ నితిన్ జియాన్ చౌదరి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కల్కి మూవీ సక్సెస్ తర్వాత ఆ సినిమాకి వర్క్ చేసిన అందరూ కూడా స్పెషల్ ఇంటర్వ్యూలు స్తూ మూవీ షూటింగ్అనుభవాలని పంచుకుంటున్నారు. అందులో భాగంగా ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ కూడా కంప్లెక్స్ గురించి ఎవరికి తెలియని విషయాలని రివీల్ చేశారు.

అయితే నితిన్ చౌదరి చెప్పినట్లు వరల్డ్ లో ఉన్న మిగిలిన ఆరు కంప్లెక్స్ లని నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 2లో చూపించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అలాగే కల్కి పార్ట్ 2లో మరో ప్రపంచాన్ని కూడా సృష్టించినట్లు నాగ్ అశ్విన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రపంచానికి సుమతిని తీసుకొని వెళ్తారని. అసలైన పోరాట ఘట్టాలు అందులో ఉంటాయని తెలిపారు.

కల్కి పార్ట్ 1 సక్సెస్ తో పార్ట్ 2పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఈ సినిమా ఎంత వేగంగా రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే కల్కి 2898ఏడీ సినిమాకి వచ్చిన కొన్ని నెగిటివ్స్ ని పరిగణంలోకి తీసుకొని పార్ట్ విషయంలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో కల్కి పార్ట్ 2 షూటింగ్ పై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంట.

Tags:    

Similar News