రామ్ చ‌ర‌ణ్ అయినా త‌గ్గేదేలే..దూసుకుపోవ‌డ‌మే!

ఒక‌వేళ `గేమ్ ఛేంజ‌ర్` ఫ‌లితం గ‌నుక ప్ర‌తికూలంగా క‌నిపిస్తే? బుచ్చిబాబుపై మ‌రింత ఒత్తిడి పెరుగుతుంది. అన్ని లెక్క‌లు స‌రిచేయాల్సిన బాద్య‌త బుచ్చి కి త‌ప్ప‌దు.

Update: 2024-12-01 09:54 GMT

ఆర్సీ 16 ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే  మైసూర్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. భారీ అంచనాల మ‌ద్య బుచ్చిబాబు తెర‌కెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్ర‌మిది. `గేమ్ ఛేంజర్` త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ నుంచి రిలీజ్ కానున్న చిత్ర‌మిది. `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత `గేమ్ ఛేంజ‌ర్` రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై అంతా కాన్పిడెంట్ గా ఉన్నారు. శంక‌ర్ ...చ‌ర‌ణ్ నెక్స్ట్ లెవ‌ల్లో చూపిస్తాడ‌ని ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.

ఒక‌వేళ `గేమ్ ఛేంజ‌ర్` ఫ‌లితం గ‌నుక ప్ర‌తికూలంగా క‌నిపిస్తే? బుచ్చిబాబుపై మ‌రింత ఒత్తిడి పెరుగుతుంది. అన్ని లెక్క‌లు స‌రిచేయాల్సిన బాద్య‌త బుచ్చి కి త‌ప్ప‌దు. ఇంకా చెప్పాలంటే `గేమ్ ఛేంజ‌ర్` కంటే? బుచ్చిబాబు సినిమాపైనే రెట్టించిన అంచనాలున్నాయి. శంక‌ర్ ఫాంలో లేక‌పోవ‌డం..గ‌త సినిమా `ఇండియ‌న్ -2` వైఫ‌ల్యంతో మెగా అభిమానులు ఆర్సీ 16పైనే ఎక్కువ అంచ‌నాలు పెట్టుకున్న‌ట్లు ప్ర‌చారంలో ఉండ‌నే ఉంది.

ఇవ‌న్నీ వెర‌సి బుచ్చిబాబుపై తీవ్ర‌మైన ఒత్తిడికి గురిచేసే అంశాలే. ఇంత‌వ‌ర‌కూ బుచ్చిబాబుకు స్టార్ హీరోని డీల్ చేసిన అనుభ‌వం లేదు. తొలి సినిమా `ఉప్పెన‌`లో న‌టించింది మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్. అత‌డికి అదే డెబ్యూ. ఆ వెంట‌నే బుచ్చిబాబు రామ్ చ‌ర‌ణ్ ఇలాకాలో చేరాడు. దీంతో చ‌ర‌ణ్ ని ఎలా డీల్ చేస్తాడు? అన్న సందేహం వ్యక్త‌మ‌వుతోంది. ఇలా బుచ్చిపై అడుగ‌డుగునా ఎన్నో ర‌క‌మైన ఒత్తిళ్లు క‌నిపిస్తున్నాయి. కానీ బుచ్చిబాబు మాత్రం ఏ మాత్రం బెద‌ర‌కుండా సినిమా చేస్తున్నాడు.

ఫ‌స్ట్ క్లాస్ న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లను తీసుకుని ముందుకెళ్తున్నాడు. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్, జ‌గ‌ప‌తి బాబు, మిర్జాపూర్ ఫేం దివ్యేందు లాంటి న‌టీన‌టులు ప‌నిచేస్తున్నారు. చ‌ర‌ణ్ కి జోడీగా జాన్వీక‌పూర్ ని రంగంలోకి దించాడు. ఇద్ద‌రి మ‌ధ్యా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోతుంద‌నే టాక్ వినిపిస్తుంది.

Tags:    

Similar News