గేమ్ చేంజర్.. ఇంకా ఆ టెన్షన్ తగ్గట్లే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ గేమ్ చేంజర్. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Update: 2024-08-20 22:30 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ గేమ్ చేంజర్. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్ తెలుగులో ఫస్ట్ టైం చేస్తోన్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అది కూడా శంకర్ కి భాగా అలవాటైన సోషల్ ఎలిమెంట్ తో ఈ మూవీ కథాంశం ఉండబోతోందనే టాక్ బయటకొచ్చింది. ఇందులో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

తండ్రి పాత్ర ఒక రాజకీయ నాయకుడిగా ఉండబోతోంది. అలాగే కొడుకు పాత్రలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఈ మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యింది. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ప్రారంభం అయినపుడు భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇండియన్ 2 మూవీ షూటింగ్ ఆగిపోయిన తర్వాత శంకర్, దిల్ రాజు కలయికలో గేమ్ చేంజర్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.

ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఒకే ఒక్కడు, జెంటిల్మన్ తరహాలో ఉంటుందనే ప్రచారం నడిచింది. దీంతో కచ్చితంగా రామ్ చరణ్ కెరియర్ లోనే గేమ్ చేంజర్ బెస్ట్ మూవీ అవుతుందని అందరూ భావించారు. అయితే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి రెండేళ్లు అవుతున్న ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. శంకర్ ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే ఇండియన్ 2 మూవీ షూటింగ్ మరల రీస్టార్ట్ చేశారు. దీంతో గేమ్ చేంజర్ పూర్తి చేయడం కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు.

ఈ ఆలస్యం కారణంగా గేమ్ చేంజర్ పై బజ్ తగ్గుతూ వచ్చింది. ఈ చిత్రం నుంచి జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అయిన కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. దీంతో గేమ్ చేంజర్ సినిమాపై ఫ్యాన్స్ కి సందేహాలు మొదలయ్యాయి. రీసెంట్ గా శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా కథ, కథాంశం పరంగా శంకర్ అస్సలు మెప్పించలేకపోయారు. శంకర్ లో ఒకప్పటి మేకింగ్ స్టైల్, లార్జర్ దెన్ లైఫ్ అనేలాంటి ఆలోచనలు మూవీలో కనిపించలేదు.

దీంతో ఇండియన్ 2 మూవీ భారీ నష్టాలు మిగిలిచింది. ఈ సినిమా ఫెయిల్యూర్ ఇంపాక్ట్ ఇప్పుడు గేమ్ చేంజర్ మీద కూడా పడిందనే మాట వినిపిస్తోంది. మెగా ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై టెన్షన్ మొదలైంది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా మూవీ కావడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై హైప్ ఉండాలి. కానీ సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ పై పెద్దగా చర్చ జరగడం లేదనే మాట వినిపిస్తోంది.

ప్రతి వారం ఒర్మాక్స్ మ్యాగజైన్ మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాని ప్రకటిస్తూ ఉంటుంది. వీటిలో దేవర, పుష్ప ది రూల్, ఓజీ సినిమాలు టాప్ లో ఉన్నాయి. గేమ్ చేంజర్ గురించి పబ్లిక్ అంతగా ఇంటరెస్ట్ చూపించడం లేదనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ లోపు మూవీపై ఏమైనా హైప్ క్రియేట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News