బిగ్ బాస్ 8 : ఈ వారం డేంజర్ జోన్ లో ఆ కంటెస్టెంట్..!

నిఖిల్ తన వీక్ నెస్ కోసం టాస్క్ లో ఒక ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం వల్ల అతనికి బాగానే నామినేషన్స్ పడ్డాయి.

Update: 2024-10-23 12:54 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రతి వారం లానే సోమవారం మొదలై మంగళవారం ఎపిసోడ్ తో నామినేషన్స్ ముగిశాయి. లాస్ట్ వీక్ జరిగిన ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఛార్జెస్ టాస్క్ నుంచే ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. నిఖిల్ తన వీక్ నెస్ కోసం టాస్క్ లో ఒక ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం వల్ల అతనికి బాగానే నామినేషన్స్ పడ్డాయి. ఐతే ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు హౌస్ మెట్స్ నిఖిల్, పృధ్వి, ప్రేరణ, మెహబూబ్, విష్ణు ప్రియ, నయని పావని, హరితేజ నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే మెగా చీఫ్ అయిన గౌతం తన దగ్గర ఉన్న నామినేషన్ షీల్డ్ ని ఉపయోగించి హరితేజని సేఫ్ చేశాడు.


సో ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో పృధ్వి, నిఖిల్, ప్రేరణ, మెహబూబ్, విష్ణు ప్రియ, నయని పావని ఉన్నారు. ఐతే వీరిలో ఈ వారం టాస్కులు బాగా ఆడి ఎవరైతే ఆడియన్స్ మనసులు గెలుస్తారో వారే సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం నయని పావని లీస్ట్ ఓటింగ్ తో కొనసాగుతుంది. ఆమె తర్వాత పృధ్వి సెకండ్ లీస్ట్ గా ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఈ వీకెండ్ తెలుస్తుంది.

నామినేషన్స్ లో రాయల్ క్లాన్ వర్సెస్ ఓజీ క్లాన్ అన్నట్టుగానే ఫైట్ జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంతా కూడా ఓజీ క్లాన్ మెంబర్స్ నే నామినేట్ చేయడం పక్కా ప్లానింగ్ ప్రకారమే అన్నట్టు తెలుస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరు ఈ వీకెండ్ హౌస్ కి గుడ్ బై చెబుతారన్నది చూడాలి. నామినేషన్స్ లో హైలెట్ గా పృధ్వి వర్సెస్ ప్రేరణ ఫైట్ జరిగింది.

అంతేకాదు అవినాష్ కూడా పృధ్విని నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో వీరిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ తెలిసిందే. దాన్ని ఈ వారం అవినాష్ కొనసాగించాడు. మరి ఈ వారం ఎవరు ఆడియన్స్ చేత తక్కువ ఓట్లతో హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.

Tags:    

Similar News