ఎన్టీఆర్.. ఇప్పట్లో దొరికేలా లేడు

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల లైన్ అప్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది.

Update: 2024-10-05 04:32 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే అందుకున్నాడు. ఇప్పటికే మేకర్స్ సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన కలెక్షన్స్ తో మూవీ దూసుకుపోతోంది. వీక్ డేస్ లో కూడా డీసెంట్ వసూళ్లతో రెండో వారంలోకి ఈ చిత్రం అడుగుపెట్టింది. ఈ రెండు రోజులు ‘దేవర’ మూవీకి మంచి కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల లైన్ అప్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. హిందీలో ‘వార్ 2’ మూవీ ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీగా ఈ చిత్రం సిద్ధమవుతోంది. హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’లో తారక్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ‘దేవర’ తో నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి తారక్ బాగా రీచ్ అయ్యాడు. ‘వార్ 2’ మూవీతో కచ్చితంగా బాలీవుడ్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ని ఎన్టీఆర్ ఏర్పాటు చేసుకోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.

‘వార్ 2’ మూవీ 2025లో థియేటర్స్ లోకి రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీని తారక్ ఇప్పటికే స్టార్ట్ చేశాడు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలు కావొచ్చని టాక్. 2026 జనవరికి ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది. దీని తర్వాత మరల కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర పార్ట్ 2’ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తారక్ 2025 ఆఖరులో స్టార్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. దీని తర్వాత ఎన్టీఆర్ లైన్ అప్ లో జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ ఉన్నారు.

ఇప్పటికే నెల్సన్ దిలీప్ ఎన్టీఆర్ కోసం ఓ మంచి కథని సిద్ధం చేసాడంట. నెల్సన్ దిలీప్ రజినీకాంత్ తో ‘జైలర్ 2’ మూవీకి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా ఆలస్యం అయితే ఎన్టీఆర్ తో సినిమాని కన్ఫర్మ్ చేసుకొని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఉండబోతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే సరికి కనీసం 4 ఏళ్ళు పట్టొచ్చని అనుకుంటున్నారు. వెట్రిమారన్ లైన్ అప్ లో ‘విడుదలై 2’, ‘వడివాసల్’ సినిమాలున్నాయి.

వీటి తర్వాత ఎన్టీఆర్ తో మూవీ పైన వర్క్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఇద్దరం డిస్కషన్ చేసుకున్నట్లు వెట్రిమారన్ గతంలో క్లారిటీ ఇచ్చారు. అంటే ఏ విధంగా చూసుకున్న ఈ సినిమాలు అన్ని పూర్తి చేసి కొత్త దర్శకుడితో మూవీ చేయాలంటే కనీసం 4 ఏళ్ళకి పైనే పడుతుంది. అయితే తారక్ త్వరలో మరల స్క్రిప్ట్స్ వినాలని అనుకుంటున్నారంట. ఈ సినిమాల మధ్యలో తక్కువ టైంలో కంప్లీట్ అయిపోయే కథ ఏదైనా వస్తే చేయడానికి తారక్ ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News