షూటింగ్ సగంలో మూవీ చేయను అంటూ మొండికి వేసిన తారక్.. అసలు రీసన్ ఇదే..
బాల నటుడి ఎన్టీఆర్ నటనా సామర్థ్యం ఎలాంటిదో చాటి చెప్పిన చిత్రం బాల రామాయణం.
బాల నటుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈనాడు గ్లోబల్ హీరోగా ఎదిగిన నటుడు ఎన్టీఆర్. ఏ డైలాగ్ నైనా గుక్క తిప్పుకోకుండా చెప్పడమే కాదు స్క్రీన్ పై తన మ్యాజిక్ తో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ హీరో ఒక సినిమా నేను చేయను అంటే చేయను అని మొండికి వేసాడు అన్న విషయం మీకు తెలుసా? ఎన్టీఆర్ నటించిన బాల రామాయణం సినిమా షూటింగ్స్ సందర్భంలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
బాల నటుడి ఎన్టీఆర్ నటనా సామర్థ్యం ఎలాంటిదో చాటి చెప్పిన చిత్రం బాల రామాయణం. ఎమ్.ఎస్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. చిన్నారులకు వినోదం పంచిన ఈ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును కూడా అందుకుంది.ఈ మూవీలో ఎన్టీఆర్ బాల రాముడుగా ఎంతో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించారు.
అయితే ఈ సినిమా రామాయణం బుక్ చదివినంత సులభం కాదు. భారీ భారీ డైలాగ్స్ చిన్నపిల్లల నోటి నుంచి వింటూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే చిన్న పిల్లలతో ఇటువంటి భారీ సినిమా తీయడమంటే మాటలు కాదు కదా. ఎవ్వరు ఒక దగ్గర కుదురుగా కూర్చునేవారు కాదట. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలో అస్సలు అల్లరి చేయని రాముడి పాత్ర పోషించిన ఎన్టీఆర్ తెర వెనుక మాత్రం కృష్ణుడి కంటే అల్లరి చేసేవాడట.
అలా ఈ మూవీలో శివధనుర్భంగం సన్నివేశం కోసం దర్శకుడు గుణశేఖర్ ప్రత్యేకంగా టేకుతో ఓ విల్లును తయారు చేయించారట. దీంతోపాటుగా సేఫ్ సైడ్ కి మరొక డూప్లికేట్ విల్లుని కూడా తయారు చేయించి పెట్టారట. అయితే షూటింగ్ జరిగే టైంలో మూవీ టీం మొత్తం సన్నివేశం కోసం సిద్ధమవుతుంటే ఎన్టీఆర్ మిగతా పిల్లలతో ఆడుతూ డూప్లికేట్ విల్లును లేపే ప్రయత్నం చేశారు. ఆ విల్లు బరువు తక్కువ ఉండడంతో సులభంగా పైకి లేపగలిగిన ఎన్టీఆర్ టేకు విల్లును కూడా లేపేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ తో దానికోసం వెతికి దాని లేపడానికి ట్రై చేశారు.
తారక్ తో పాటు అక్కడున్న మిగిలిన పిల్లలందరూ కూడా మొదట విల్లును ఎత్తడానికి ప్రయత్నించి చేతకాక పక్కన పెట్టేసారు. అయితే తారక్ మాత్రం కష్టపడి ఆ విల్లుని పైకి అయితే ఎత్తగలిగారు కానీ బ్యాలెన్స్ కోల్పోవడంతో విల్లుతో సహా కింద పడిపోయాయి. అలా ఆ విల్లు కాస్త విరిగిపోయింది. తారక్ పై కోపం వచ్చిన గుణశేఖర్ విపరీతంగా తిట్టారట. దీంతో ఎన్టీఆర్ నేను అసలు ఈ సినిమా చేయనంటే చేయను వెళ్ళిపోతానని గోల మొదలుపెట్టారు. ఫైనల్ గా అందరూ సర్ది చెప్పడంతో తారక మూవీ కంప్లీట్ చేశారు.