ఎన్టీఆర్ క్యారెక్టర్ పై ట్రోల్స్… క్లారిటీ ఇచ్చిన రత్నవేలు

ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఆయన సినిమాటోగ్రఫీకి ఎవరు వంకలు పెట్టలేరు.

Update: 2024-09-23 06:36 GMT

ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఆయన సినిమాటోగ్రఫీకి ఎవరు వంకలు పెట్టలేరు. నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దేవర’ మూవీ ట్రైలర్ లో విజువలైజేషన్ కి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. విజువల్ ప్రెజెన్స్ పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ట్రైలర్ లో కొన్ని సీన్స్ లో ఎన్టీఆర్ ని చాలా పొట్టిగా చూపించారని ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో నడుస్తున్నాయి.

ఈ కామెంట్స్ పై రత్నవేలు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాలో ఎన్టీఆర్ ని పొట్టిగా లేదంటే పొడవుగా చూపించడం కోసం కెమెరా యాంగిల్స్ ఉపయోగించలేదని తెలిపారు. సినిమాకి ఏది అవసరమో అదే విజువల్ లో చూపించడం జరిగింది. అలాగే స్టోరీ, సీన్ ఏం డిమాండ్ చేస్తే దానినే కెమెరాతో చిత్రీకరించామని చెప్పుకొచ్చారు. తెర పైన విజువల్ చూసిన తర్వాత ఎవరైనా కామెంట్స్ చేయాలని అన్నారు.

‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ మూవీ సెకెండాఫ్ లోనే రివీల్ అవుతుంది. ఆమె పాత్ర నిడివి కూడా మెజారిటీగా సెకండాఫ్ లోనే ఉంటుందని తెలిపాడు. సినిమా చూస్తున్నంత సేపు ఎన్టీఆర్ క్యారెక్టర్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అయిన బయటకొచ్చాక మాత్రం ప్రతి ఒక్కరు జాన్వీ కపూర్ చేసిన పాత్ర గురించి మాట్లాడుకుంటారని అన్నారు. అంత బలంగా స్టోరీలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఉంటుందని తెలిపారు.

అలాగే సినిమాలో తండ్రి క్యారెక్టర్ విషయంలో ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేయని సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుందని కూడా రత్నవేలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తెరపై కచ్చితంగా ఆ ట్విస్ట్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని అన్నారు. మొత్తానికి ‘దేవర’ మూవీ గురించి చాలా ఇంటరెస్టింగ్ అంశాలని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఇదిలా ఉంటే ‘దేవర’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అయిన కూడా మూవీకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిందనే మాట వినిపిస్తోంది. ఈ సినిమా కోసం తారక్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్ లో ‘దేవర’ బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా నటించారు. ఎన్టీఆర్ మూడు పాత్రలలో కనిపిస్తాడనే ప్రచారం నడుస్తోంది. అది ఎంత వరకు వాస్తవమో తెలియదు. అనిరుద్ ఈ సినిమాకి బెస్ట్ స్కోర్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News