ఎన్టీఆర్ మైండ్‌లో టాప్-3 త‌మిళ్ డైరెక్ట‌ర్స్

మొత్తానికి త‌మిళ ఇంట‌ర్వ్యూల్లో తార‌క్ త‌న ఫేవ‌రెట్ త‌మిళ ద‌ర్శ‌కుల జాబితాను బ‌య‌ట‌పెట్టాడు. వేట్రి మార‌న్- అట్లీ కుమార్- లోకేష్ క‌న‌గ‌రాజ్ - నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అత‌డు న‌టించేందుకు ఆస్కారం ఉంది.

Update: 2024-09-19 21:30 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తెలుగులో అగ్ర ద‌ర్శ‌కులతో ప‌ని చేస్తున్నారు. కొర‌టాల శివ‌, రాజ‌మౌళి, సుకుమార్, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, వివి వినాయ‌క్ లాంటి టాప్ డైరెక్ట‌ర్ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్లు సొంతం చేసుకున్నాడు. కొర‌టాల‌తో 'జ‌న‌తా గ్యారేజ్' అద్భుత‌ విజ‌యం సాధించింది. మ‌రోసారి 'దేవ‌ర' కోసం ఈ జోడీ క‌లిసి ప‌ని చేసారు. దేవ‌ర ఈనెల 27న రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా విడుద‌ల‌వుతున్న దేవ‌ర‌ను త‌మిళంలోను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా విడుద‌లకు సిద్ధం చేసారు. అక్క‌డ ఎన్వీ ప్ర‌సాద్ లాంటి దిగ్గ‌జం దేవ‌ర‌ను విడుద‌ల చేస్తుండ‌డం ట్రేడ్ లో ఉత్సాహం పెంచింది.

ఈ సంద‌ర్భంగా కొద్దిరోజులుగా ఎన్టీఆర్ చెన్నైలో 'దేవ‌ర' త‌మిళ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్నారు. అక్క‌డ ప‌లు మీడియా ఇంట‌ర్వ్యూల్లో తార‌క్ త‌మిళ ద‌ర్శ‌కుల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇంత‌కుముందే జాతీయ ఉత్త‌మ ద‌ర్శ‌కుడు వేట్రి మార‌న్ తో ప‌ని చేయాల‌నుంద‌ని ఎన్టీఆర్ అన్నారు. వేట్రి స‌ర్ ఒక త‌మిళ సినిమాలో అవ‌కాశం క‌ల్పిస్తే న‌టించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని ఎన్టీఆర్ అభ్య‌ర్థించారు.

తాజా ఇంట‌ర్వ్యూలో అట్లీ కుమార్ తోను ఓ సినిమా చేయాల‌నే ఆలోచ‌న ఉంద‌ని తెలిపారు. గ‌తంలో ఓ కొత్త‌ద‌నం ఉన్న‌ రొమాంటిక్ ల‌వ్ స్టోరీని అట్లీ త‌న‌కు వినిపించార‌ని, ఇద్ద‌రం క‌లిసి దీనిపై చ‌ర్చించామ‌ని తార‌క్ చెప్పారు. అయితే మా ఇద్ద‌రికీ వ‌రుసగా సినిమాలు ఉన్నాయి. కాల్షీట్లు కుద‌ర‌క‌పోవ‌డంతో ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేద‌ని తార‌క్ తెలిపారు. అట్లీ తెర‌కెక్కించిన రాజా రాణి త‌న‌కు బాగా న‌చ్చిన సినిమా అని కూడా ఆయ‌న‌ అన్నారు.

అలాగే లోకేష్ క‌న‌గ‌రాజ్ 'విక్ర‌మ్'పైనా తార‌క్ ప్ర‌శంస‌లు కురిపించారు. విక్ర‌మ్ ప‌రిశ్ర‌మ గౌర‌వాన్ని పెంచింద‌ని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ర‌జ‌నీకాంత్ జైలర్ లో చాలా స్పెష‌ల్ గా క‌నిపించారు. ఇప్ప‌టివ‌ర‌కూ అలాంటి పాత్ర‌లో ఆయ‌న‌ను చూడ‌లేదు అని కూడా అన్నారు. ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ పైనా ప్ర‌శంస‌లు కురిపించారు. రాయ‌న్ చిత్రంలో ధ‌నుష్ న‌ట‌న అద్భుతంగా ఉంద‌ని తార‌క్ ఈ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శంసించారు.

మొత్తానికి త‌మిళ ఇంట‌ర్వ్యూల్లో తార‌క్ త‌న ఫేవ‌రెట్ త‌మిళ ద‌ర్శ‌కుల జాబితాను బ‌య‌ట‌పెట్టాడు. వేట్రి మార‌న్- అట్లీ కుమార్- లోకేష్ క‌న‌గ‌రాజ్ - నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అత‌డు న‌టించేందుకు ఆస్కారం ఉంది. వేట్రి మార‌న్, అట్లీ, లోకేష్ ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఉంద‌ని అర్థ‌మైంది.

Tags:    

Similar News