తారక్ మరో బడా మూవీ.. టాప్ ప్రొడ్యూసర్ సూపర్ హింట్!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. దేవర మూవీతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-11 09:54 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. దేవర మూవీతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ.. సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ ను పూర్తి చేస్తున్నారు. పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.

ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండా వన్ మిలియన్ ప్రీ సేల్స్ క్రాస్ చేసిన తొలి ఇండియన్ మూవీగా దేవర రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే మేకర్స్ రీసెంట్ గా దేవర ట్రైలర్ ను విడుదల చేశారు. అందుకు గాను ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తారక్ చేసిన వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అయ్యాయి. ఆరేళ్ల తర్వాత తన సోలో మూవీ దేవర విడుదల కోసం తాను కూడా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

అయితే బాలీవుడ్ లోకి తారక్ త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న వార్-2 మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న స్పై ఏజెంట్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ త్వరలోనే రానుందని సమాచారం. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయనున్నారట. వచ్చే ఏడాది ఆగస్టు 14వ తేదీన వార్-2 రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

కాగా, బాలీవుడ్ లో డెబ్యూ మూవీ రిలీజ్ అవ్వకుండానే.. మరో బీటౌన్ ప్రొడ్యూసర్ నిర్మించే ప్రాజెక్టుకు గాను తారక్ ఛాన్స్ అందుకున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యలే. దేవర ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఆయన.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర అని తెలిపారు. తాను నార్త్ లో దేవర మూవీని రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా, గొప్పగా ఉందని చెప్పారు.

అదే సమయంలో తనకు ఈ ప్రయాణంలో ఎంతో మంది స్నేహితులు అయ్యారని తెలిపారు కరణ్ జోహార్. అందులో తారక్ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. తమ రిలేషన్ కు ఇది ఎండింగ్ కాదని.. కొత్త బంధానికి నాంది అని పేర్కొన్నారు. తానేం చెబుతున్నానో తారక్ కు తెలుసు అని అన్నారు. అలా ఇన్ డైరెక్ట్ గా ఎన్టీఆర్ తో మూవీ తీయనున్నట్లు తెలిపారు. దీంతో తారక్ అభిమానులు.. ఫుల్ ఖుషీ అవుతున్నారు. వెయిటింగ్ ఫర్ అన్న అప్డేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కరణ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News