దేవర స్పెషల్ చిట్ చాట్.. ఆ ఇద్దరు యువ హీరోలతో భయం గురించి ఎన్టీఆర్..!

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా మరో వారంలో రిలీజ్ కాబోతుంది.

Update: 2024-09-19 11:48 GMT

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా మరో వారంలో రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే ముంబైలో ప్రమోషన్స్ మొదలు పెట్టగా లేటెస్ట్ గా ఈ సినిమా కోసం యువ హీరోలిద్దరితో కలిసి స్పెషల్ చిట్ చాట్ ప్లాన్ చేశారు. యువ హీరోలు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరు కూడా ఎన్టీఆర్ కి అభిమానులే. ఈ ఇద్దరు కలిసి ఎన్టీఆర్ దేవరకు సంబంధించిన విశేషాలను తెలుసుకునేందుకు స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు.


అందుకు సంబంధించిన ప్రోమో రిలీజైంది. దేవర చిట్ చాట్ ప్రోమోలో భాగంగా సిద్ధు జొన్నలగడ్డ మీద ఎన్టీఆర్ పంచ్ లు వేశాడు. విశ్వక్ తో కలిసి తారక్ సిద్ధుని ఒక ఆట ఆడుకున్నారు. ఎన్టీఆర్ తనపై చేస్తున్న కామెంట్స్ కు సిద్ధు పిలిచి ఇలా చేస్తున్నారని సరదాగా అన్నాడు. ఈ ఇంటర్వ్యూ మొత్తం యువ హీరోల ఎనర్జిటిక్ ప్రశ్నలతో పాటు ఎన్టీఆర్ మార్క్ ఆన్సర్స్ తో నడిచిందని చెప్పొచ్చు.

దేవర స్పెషల్ చిట్ చాట్ ప్రోమోనే సూపర్ గా అనిపించింది. తప్పకుండా ఈ ఇంటర్వ్యూ సెన్సేషనల్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఐతే చిట్ చాట్ లో భాగంగా ఎన్ టీ ఆర్ భయం ఏంటని విశ్వక్ సేన్ అడిగితే తన ఫియర్ గురించి తారక్ వివరించినట్టు తెలుస్తుంది. కొరటాల శివ దేవర సినిమాను సంథింగ్ స్పెషల్ గా తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ కు ముందే ఎన్టీఆర్ స్టామినా ఏంటన్నది చూపించేలా ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి.

దేవర సినిమాలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి దేవర సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. దేవర సినిమా వైబ్ అదిరిపోగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేస్తానని ఎన్టీఆర్ ఆల్రెడీ తన స్టేట్మెంట్ తో అంచనాలు రెట్టింపు చేస్తున్నారు. మరి సినిమా పై ఒకదానికి మించి మరోటి అన్నట్టుగా అంచనాలు పెంచుతుండగా అందుకు తగినట్టుగా ఫలితం ఉంటుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News