బియాండ్ ఫెస్ట్ 2024: లాస్ ఏంజిల్స్‌లో ఎన్టీఆర్ హల్‌చల్

సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ముందు RRR చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడం జరిగింది.

Update: 2024-09-25 06:45 GMT

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ప్రత్యేక స్క్రీనింగ్‌లో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. RRR సినిమా స్క్రీనింగ్ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని బియాండ్ ఫెస్ట్ 2024 ఉత్సవానికి ప్రిపరేషన్‌గా నిర్వహించారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ముందు RRR చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడం జరిగింది.

ఎన్టీఆర్ స్క్రీనింగ్ హాల్లో అడుగుపెట్టగానే అభిమానులు పవర్ఫుల్ సౌండ్ తో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన రాబోయే సినిమా దేవర గురించి కూడా మాట్లాడారు. కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్, ఆయన భార్య ప్రణతి ఇద్దరూ దేవర స్క్రీనింగ్ కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా ఉన్న నిర్వాహకులు ఎన్టీఆర్‌కి గ్రాండ్ ఇన్ట్రడక్షన్ ఇవ్వడం విశేషం.

“మనమంతా ఈ రోజు ఈ భవనంలో, ఈ స్థానంలో ఉన్నామంటేనే అదొక గొప్ప విషయం. లాస్ ఏంజిల్స్, మనందరం ఎన్టీఆర్ కోసం ఒక్కసారి కేకలు వేయండి. మాస్ ఆడియన్స్‌కి ఎన్టీఆర్ ఎంత ప్రత్యేకమైన నటుడో అందరికీ తెలిసిందే. ఈ స్థాయిలో మాస్ జాతీయ స్థాయి నటుడు మరొకరు లేరు. RRR స్టార్.. దేవర స్టార్.. జూనియర్ ఎన్టీఆర్‌కు జేజేలు పలుకుదాం,” అంటూ హోస్ట్ ఎన్టీఆర్‌ని ప్రశంసించారు.

ఎన్టీఆర్ స్టేజ్‌పైకి రాగానే, అభిమానులకు నమస్కరించారు. ఈ కార్యక్రమం గురించి Beyond Fest అధికారిక పేజీలో కూడా ఫోటో షేర్ చేస్తూ, "విశ్వాసమే కాదు.. ఎన్టీఆర్ ఈ రోజు రాత్రి దేవర గురించి చెప్పడానికి సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రపంచం దీనికి సిద్ధంగా ఉంది,” అంటూ వారి భావాలను పంచుకున్నారు. ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 26న (భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 27న ఉదయం 4:00 గంటలకు) దేవర చిత్రాన్ని బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శించనున్నారు.

ఈ కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్టీఆర్ పాపులారిటీని మరింత పెంచింది. RRRతో పాటు దేవర పై ఉన్న ఆసక్తి ఈ ఈవెంట్‌ ద్వారా మరింతగా పెరిగింది. చూస్తుంటే ఎన్టీఆర్ దేవర సినిమాతో ఊహించని రేంజ్ లో గుర్తింపు అందుకోబోతున్నట్లు అర్ధమవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర పార్ట్ 1 ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మంచి కలెక్షన్స్ అందుకుంటోంది.

Tags:    

Similar News