ఎన్టీఆర్ - నీల్.. ఎవరి దారి వారిదే..

ఇక అదే సమయంలో కేవలం ఒకే భాగంగా వస్తుందని అనుకున్న సలార్ సినిమా కూడా రెండు భాగాలుగా విడిపోయింది

Update: 2024-03-13 03:00 GMT

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. మొదట ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు 2 పార్ట్స్ గా వస్తుందని కొంచెం కూడా హింట్ ఇవ్వలేదు. అయితే సినిమా స్టోరీ స్పాన్ చాలా పెద్దది అని మరింత విజువల్స్ అందించే విధంగా రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు దర్శకుడు వివరణ ఇచ్చేశాడు. ఇక అదే సమయంలో కేవలం ఒకే భాగంగా వస్తుందని అనుకున్న సలార్ సినిమా కూడా రెండు భాగాలుగా విడిపోయింది.

అసలు ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత.. అది కూడా సగానికి పైగా వర్క్ ఫినిష్ అయిన తర్వాత రెండు భాగాలుగా వస్తున్నాయని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ టు పార్ట్స్ ప్లాన్ అనేది ముందే అనుకున్నారో.. లేదా తర్వాత అనుకున్నారో కానీ, ముందే అనుకున్న కాంబినేషన్స్ విషయంలో మాత్రం ప్రణాళికలు పూర్తిగా మారిపోయాయి.

దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అనుకున్న విషయం తెలిసింది. అయితే ఎన్టీఆర్ కూడా పక్క ప్లాన్ తోనే దేవర సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీల్ తో చేయాల్సిన NTR31 కోసం సిద్ధమవ్వాలని అనుకున్నాడు. ఇక ఆ తరువాత దేవర రెండు భాగాలు అని చెప్పడంతో పాటు హఠాత్తుగా ఎన్టీఆర్ వార్ 2 సినిమా లైన్ లోకి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ 31 సంగతి ఏంటి అనేది కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది.

వార్ 2 షూటింగ్ లో ఎన్టీఆర్ ఏప్రిల్ లోనే స్టార్ట్ చేయబోతున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇంతలోనే సలార్ 2 సినిమా షూటింగ్ కూడా ఏప్రిల్ లో స్టార్ట్ కాబోతున్నట్లు అందులో నటిస్తున్న వారు క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ బిజీ కావడంతో ప్రశాంత్ సేఫ్ జోన్ లోనే ముందుగానే ప్రిపేర్ చేసుకున్న సలార్ 2 టైమ్ వేస్ట్ చేయకుండా చేస్తోంది.

ఇప్పుడు ఎన్టీఆర్ బిజీగా ఉన్నన్ని రోజులు ప్రశాంత్ ప్రభాస్ తో సలార్ 2 చేస్తాడు. ఇక ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 రిజల్ట్ ని బట్టి సెకండ్ పార్ట్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం సలార్ ప్రాజెక్టు అనంతరం ఎలాంటి యూ టర్న్ తీసుకోకుండా ఎన్టీఆర్ 31 కోసం ప్లాన్స్ ప్రిపేర్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక అప్పటివరకు ఎన్టీఆర్ కూడా సిద్ధంగా ఉంటాడు. ఈ విధంగా ఎన్టీఆర్ - నీల్ ఎవరి టైమ్ వేస్ట్ అవ్వకుండా ఎవరి దారిలో వారు వెళుతున్నారు.

Tags:    

Similar News