హృతిక్ తో టైగ‌ర్ సై..ఇద్ద‌రి మ‌ధ్య అతి పెద్ద వార్!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముంబైలో ల్యాండ్ అయిన ద‌గ్గ‌ర నుంచి `వార్- 2` షూటింగ్ వేగంగా జ‌రుగుతోంది.

Update: 2024-04-30 06:50 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముంబైలో ల్యాండ్ అయిన ద‌గ్గ‌ర నుంచి `వార్- 2` షూటింగ్ వేగంగా జ‌రుగుతోంది. తారక్ తో కాంబినేష‌న్ సీన్స్ అన్నింటిని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాలి అన్న ఉద్దేశంతో ఆయ‌న్ ముఖ‌ర్జీ టీమ్ అంద‌ర్నీ ప‌రుగులు పెట్టిస్తున్నారు. డే అండ్ నైట్ యూనిట్ షూటింగ్ ప‌నుల్లోనే బిజీగా ఉంటుంది. తార‌క్-హృతిక్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. తార‌క్ ఆన్ సెట్స్ రాక కోసం ఎంతో వెయిట్ చేసిన హృతిక్ ఇప్పుడు తార‌క్ తో మంచి స‌మ‌యాన్ని ఆస్వాదిస్తున్నాడు. తాజాగా సినిమాకి సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.

తార‌క్-హృతిక్ మ‌ధ్య ఓ పాట కూడా ప్లాన్ చేస్తున్నారుట‌. ఈ పాటకు వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ చేస్తున్నార‌ని స‌మాచారం. అదే నిజ‌మైతే వైభ‌వ్ కిది పెద్ద స‌వాల్ అనే చెప్పాలి. హృతిక్ ఎంత గొప్ప డాన్స‌ర్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ లో నెంబ‌ర్ వ‌న్ డాన్స‌ర్ గా హృతిక్ కి మంచి పేరుంది. ఎలాంటి పాట‌ల‌కైనా త‌న‌దైన మార్క్ స్టెప్పుల‌తో వ‌న్నె తేగ‌ల గ్రేట్ డాన్స‌ర్. శ‌రీరాన్ని విల్లులా వంచి డాన్సు చేయ‌గ‌ల దిట్ట‌. అలాంటి డాన్స‌ర్ తో ఇప్పుడు తార‌క్ పోటీ ప‌డాల్సిన స‌మ‌యం వ‌చ్చింది.

ఇక తార‌క్ డాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ లో తార‌క్ గ్రేట్ డాన్స‌ర్ గా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. త‌న డాన్స్ తో ఆడియ‌న్స్ ని మెస్మ‌రైజ్ చేయ‌గ‌లడు. అందులో తన‌కంటూ ఓ యూనిక్ స్టైల్ సైతం క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి తార‌క్ ఇప్పుడు హృతిక్ తో పోటీ ప‌డుతున్నాడు. న‌టుడిగా..డాన్స‌ర్ గా హృతిక్ ఎంతో సీనియ‌ర్. తార‌క్ లాంటి డాన్స‌ర్ల‌ని ఎంతో మందిని చూసాడు. మ‌రి తార‌క్ డాన్స్ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంటుంద‌న్న‌ది త‌ర్వాత తెలుస్తుంది.

అయితే ఈ పాట‌ని కొరియోగ్ర‌ఫీ చేయ‌డం అంత వీజీ కాదు. వైభ‌వ్ ఇద్ద‌రి ఇమేజ్ని దృష్టి లోపెట్టుకుని కొరియోగ్ర‌ఫీ చేయాల్సి ఉంటుంది. అది ఎంతో బ్యాలెన్సింగ్ గానూ ఉండాలి. ఎన్నో పాట‌ల‌కు కొరియోగ్ర‌ఫీ చేసిన అనుభ‌వం వైభ‌వ్ సొంతం. కొరియోగ్ర‌పీలో త‌న‌కంటూ ఓ స్టైల్ ని క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్ రిలీజ్ `ప‌ఠాన్` లో కొన్ని సిగ్నేచ‌ర్ స్టెప్స్ వైభ‌వ్ కొరియోగ్ర‌ఫీ చేసిన‌వే. మ‌రి `వార్ -2` లో ఆ ఇద్ద‌ర్నీ ఎలా చూపిస్తాడు? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News