యంగ్ టైగ‌ర్ ఇలాంటి స‌ర్ ప్రైజ్ లు అస్స‌లివ్వ‌డు!

అయితే తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'వార్ -2' కంటే ముందే 'టైగ‌ర్ 3' తో బాలీవుడ్ లో లాంచ్ అవుతున్న‌ట్లు ఓ వార్త వైర‌ల్ అవుతుంది.

Update: 2023-09-17 06:01 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. హృతిక్ రోష‌న్ తో క‌లిసి 'వార్ -2' లో న‌టించ‌బోతున్నారు. ఇందులో తార‌క్ పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు. హృతిక్ తో పాటు హీరో పాత్ర పోషిస్తున్నాడా? లేక అత‌నికి ఎదురెళ్లి ఢీ కొట్ట‌బోతున్నాడా? అన్న వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. నెగిటిట్ పాత్ర అయితే ఎలా ఉంటుంది? దాన్ని యంగ్ టైగ‌ర్ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అన్న మీమాంస కూడా ఉంది.

హృతిక్ రోష‌న్ తో పాటు స‌రిస‌మానమైన పాత్ర అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. లేదంటే మ‌ళ్లీ థియేట‌ర్లు చినిగిపోవ‌డం...కుర్చిలు పగిలిపోవ‌డం ఖాయం. 'ఆర్ ఆర్ ఆర్' విష‌యంలో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. రామ్ చ‌రణ్ కి ధీటుగా ఆ పాత్ర లేద‌ని జూనియ‌ర్ అభిమానులు థియేట‌ర్లో చేసిన ర‌చ్చ తెలిసిందే. ఈ విష‌యంలో తార‌క్ కూడా అసంతృప్తిగా ఉన్న‌ట్లు అటుపై మీడియా క‌థ‌నాలు వెడెక్కించాయి.

ఇలా 'వార్ -2' విష‌యంలో టైగ‌ర్ పాత్ర విష‌యంలో ఇన్ని ర‌కాల సందేహాలున్నాయి. అయితే తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'వార్ -2' కంటే ముందే 'టైగ‌ర్ 3' తో బాలీవుడ్ లో లాంచ్ అవుతున్న‌ట్లు ఓ వార్త వైర‌ల్ అవుతుంది. సల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తోన్న ఆ సినిమాలో తార‌క్ క్లైమాక్స్ లో వ‌చ్చి మెప్పించ‌బో త‌న్నాడ‌ని..ఇది గెస్ట్ రోల్ లాంటింద‌ని....విక్ర‌మ్ లో సూర్య‌లా రోలెక్స్ లా స‌ర్ ప్రైజ చేస్తాడు? అంటూ కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది.

పైగా 'వార్2' చిత్రాన్ని నిర్మిస్తోన్న య‌శ్ రాజ్ ఫిలింస్ 'టైగ‌ర్ 3' కూడా నిర్మించ‌డంతో ! తార‌క్ ని గెస్ట్ గా ఒప్పించిన‌ట్లు ఓ వార్త వైర‌ల్ అవుతోంది. అయితే ఇది నిజం అవ్వ‌డానికి ఏమాత్రం ఛాన్స్ లేద‌నిపిస్తుంది. ఇప్ప‌టికే 'టైగ‌ర్ 3' షూటింగ్ కూడా పూర్త‌యింది.

ఒక‌వేళ ఎన్టీఆర్ గెస్ట్ అపిరియ‌న్స్ లాంటింది ఇచ్చి ఉంటే? ఆ విష‌యాన్ని అధికారికంగా య‌శ్ రాజ్ ఫిలింస్ రివీల్ చేసి పాన్ ఇండియాలో ఆ చిత్రాన్ని ఓ సంచ‌ల‌నంగా రిలీజ్ చేసేది. లేకుంటే మ‌రో ర‌కంగానైనా టైగ‌ర్ ఎంట్రీ సంగ‌తి లీక్ అయ్యేది.

Tags:    

Similar News