భక్త కన్నప్ప నుంచి నుపుర్ ఔట్.. రీజన్ ఏంటి?

హీరోయిన్ గా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ని ఎంపిక చేశారు. దర్శకుడిని సైతం బాలీవుడ్ కి చెందిన వ్యక్తినే ఎంపిక చేయడం గమనార్హం.

Update: 2023-09-21 13:31 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మంచు విష్ణు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అలరిస్తూ వస్తున్నాడు. అయితే, ఈమధ్యకాలంలో మంచు విష్ణు నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఆయన కెరీర్ లో పెద్దగా చెప్పుకోదగిన హిట్లు కూడా లేవనే చెప్పాలి. తన తండ్రి వారసత్వంతో వచ్చినా, ఆయన రేంజ్ కి మాత్రం అందుకోలేకపోయాడు.

అయితే, ఈ సారి మాత్రం బాక్సాఫీసును షేక్ చేయాలని మంచు విష్ణు భావించారు. చాలా కాలం తర్వాత ఆయన ఓ భారీ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు వచ్చారు.అది కూడా ఓ డివోషనల్ కథతో ముందుకు రావాలని అనుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ పేరు కూడా ప్రకటించారు.ఆయన భక్త కన్నప్ప చిత్రాన్ని మరోసారి ఇప్పటి ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకుంటున్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం పేరు కన్నప్ప. ఈ భక్తికరస చిత్రాన్ని తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తిలో ప్రారంభించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ ల్లో ప్రేక్షకులకు అందించాలని ఆయన అనుకుంటున్నారు.

ఈ చిత్రాన్ని సాదా,సీదాగా కాకుండా భారీ బడ్జెట్ లో తెరకెక్కించాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకి దాదాపు రూ.90కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ని ఎంపిక చేశారు. దర్శకుడిని సైతం బాలీవుడ్ కి చెందిన వ్యక్తినే ఎంపిక చేయడం గమనార్హం.

అయితే, సడెన్ గా ఈ మూవీ నుంచి నుపుర్ తప్పుకోవడం గమనార్హం. నుపుర్ కి మూవీ షెడ్యూల్స్ సెట్ కాలేదని, అందుకే, ఈ మూవీ నుంచి తప్పుకున్నారంటూ మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. అయితే, అాదే నిజం అయితే, కనీసం ఇలాంటి మంచి ప్రాజెక్టు వదులుకున్నందుకు నుపుర్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ అయినా పెట్టి ఉండాలి. కానీ, అలా ఏమీ జరగలేదు. తనకు ఏ సంబంధం లేదు అన్నట్లుగా ఆమె ప్రవర్తిస్తోంది. దీంతో ఆమె ఈ మూవీ నుంచి తప్పుకోవడానికి రీజన్ ఏంటి అని మొదలైంది.

ఇక, ఈ భక్త కన్నప్ప సినిమాకి మహాభారత హిందీ సీరియల్ కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ మఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం అందించనున్నారు. ఇక, ప్రముఖ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, సాయి మాధవ్, తోట ప్రసాద్ కథను అందించగా, మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags:    

Similar News