ఆపరేషన్ వాలంటైన్.. అన్నీ మంచి శకునములే
మెగాస్టార్ చిరంజీవి ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చి చిత్ర యూనిట్ కి విషెస్ తెలియజేశారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ఆపరేషన్ వాలంటైన్. మార్చి 1న తెలుగు, హిందీ భాషలలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చి చిత్ర యూనిట్ కి విషెస్ తెలియజేశారు.
వరుణ్ తేజ్ సినిమా సెలక్షన్స్ మిగిలిన హీరోలకి భిన్నంగా ఉంటుందని ఆపరేషన్ వాలంటైన్ తో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలంటే బలమైన కథ, కథనాలు ఉన్న మూవీస్ కి పెద్దపీట వేస్తాడు. అయితే వరుణ్ తేజ్ నుంచి చివరిగా వచ్చిన గని, గాండీవదారి అర్జున సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. గని అయితే వరుణ్ తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ లాస్ వచ్చిన మూవీ అని చెప్పాలి. గత రెండు సినిమాల ఇంపాక్ట్ ఆపరేషన్ వాలంటైన్ మీద లేదని చెప్పాలి. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగిందంట. అన్ని ఏరియాలకి సంబందించిన రైట్స్ ని పెద్ద డిస్టిబ్యూటర్స్ సొంతం చేసుకున్నారంట.
మార్చి 1న ఈ సినిమాకి పోటీ ఇచ్చే స్థాయిలో వేరే సినిమాలేవీ లేకపోవడం, అలాగే కంటెంట్ కూడా దేశభక్తికి సంబందించిన ఎలిమెంట్స్ తో ముడిపడింది కావడం వలన ఈ సినిమా పట్ల డిస్టిబ్యూటర్స్ ఆసక్తి చూపించారంట. దేశభక్తి కథలకి తెలుగులో ఎక్కువ ఆదరణ ఉంటుంది. అయితే ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెలుగులో వస్తోన్న మొదటి సినిమా ఇదే అని చెప్పాలి.
పుల్వామా ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉంటుందంట. రియల్ లైఫ్ సంఘటనలని స్ఫూర్తిగా తీసుకొని దర్శకుడు ఈ కథని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ప్రేక్షకులను ఈ మూవీ ఏ మేరకు మెప్పిస్తుందనేది వేచి చూడాలి.