మెకాఫే వైరస్ ఓర్రీతో అందగత్తెల ఫోజులేల?
సచిన్ టెండూల్కర్ .. విరాట్ కోహ్లీ సిగ్నేచర్ షాట్‌ల గురించి ఎక్కువగా ప్రజలు మాట్లాడుకుంటారు.
సచిన్ టెండూల్కర్ .. విరాట్ కోహ్లీ సిగ్నేచర్ షాట్‌ల గురించి ఎక్కువగా ప్రజలు మాట్లాడుకుంటారు. షారూఖ్ సిగ్నేచర్ ఫోజ్.. సల్మాన్ బ్రాస్ లెట్ ఫోజ్ గురించి ఎక్కువగా చర్చ సాగుతుంది. కానీ ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఓర్రీ (అవ్రతమణి) సిగ్నేచర్ ఫోజ్ గురించి నెటిజనం ఎక్కువగా చర్చిస్తున్నారు. అలాంటి ఒక సిగ్నేచర్ ఫోజ్ తో అతడు నైట్ పార్టీలో కాకలు పుట్టించాడు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో సునామీ స్పీడ్ తో దూసుకుపోతున్నారు.
బాలీవుడ్ నైట్ పార్టీల్లో రెగ్యులర్ గా కనిపించే ఓర్రీ ఇప్పుడు స్నేహితుడి ప్రీవెడ్డింగ్ కార్యక్రమంలో భామలతో కలిసి కనిపించాడు. సోషల్ మీడియా సంచలనం ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవత్రామణి గత రాత్రి (అక్టోబర్ 18) తన స్నేహితులు క్రిషా పరేఖ్ - యష్ సింఘాల్‌ల ప్రీ వెడ్డింగ్ పార్టీకి హాజరయ్యారు. కాక్‌టెయిల్ పార్టీలో అందమైన భామలతో అతడి సిగ్నేచర్ ఫోజ్ కేంద్రక ఆకర్షణగా మారింది. అనన్య పాండే, జాన్వీ కపూర్‌తో , సారా అలీఖాన్, ఖుషీ కపూర్, షానాయ కపూర్ సహా చాలామంది సెలబ్రిటీ గాళ్స్ అతడితో ఫోజుల కోసం తహతహలాడారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. పరేఖ్ - సింఘాల్ గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు కానీ, ఆ ఇద్దరూ చిత్ర పరిశ్రమలో బాగా కనెక్ట్ అయి ఉన్నారని ఈ పార్టీని బట్టి అర్థమవుతోంది.
ఇదే పార్టీలో క్రికెట్ లెజెండ్ ఎం.ఎస్ ధోని భార్య సాక్షి, అర్జున్ కపూర్, మీజాన్ జాఫేరీ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఓర్రీ ఇండియా టుడే కాన్క్లేవ్ 2024లో మాట్లాడుతూ తనకు ఇంతటి ఆదరణ ఎలా సాధ్యమో చెప్పాడు. ``ఇప్పుడు నేను మీకు అబద్ధం చెప్పగలను.. నాకు ఒక సిగ్నేచర్ భంగిమ అలవాటు. నా స్టైల్ కంటెంట్ పై నేను చేసే పని కారణంగా నేను పాపులరయ్యానని చెప్పగలను. నన్ను వెలుగులోకి తీసుకురావడానికి కారణం పాపులర్ స్నేహితులు ఎక్కువమంది లేరు నాకు. ఇంతమందికి స్నేహితుడిగా ఉన్నాను. ఇది నా అదృష్టం`` అని ఓర్రీ అన్నాడు.
ఈ రోజు ఇంటర్నెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖాలలో ఓర్రీ ఒకడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు.. అతడి పేరుతో గూగుల్ చేస్తే వైరస్ సోకేంత ప్రమాదకరమైన పేరుగా ఓర్రీ పాపులరైంది. ఆ మేరకు మెకాఫీ ఒక సర్వేను కూడా నిర్వహించి ఈ నిజాన్ని బయటపెట్టింది.