ఓర్రీ వెస్ట్రన్ లుక్ మైండ్ బ్లాక్
ఓర్రీ కొత్త లుక్ యువతరానికి బిగ్ షాక్ నిచ్చింది. అతడు తన హెయిర్ స్టైల్‌ని పూర్తిగా పాశ్చాత్య ధోరణిలో షేపప్ చేసి విదేశీయుడిలా కనిపించాడు.
హై ప్రొఫైల్ ఈవెంట్లు, నైట్ పార్టీలలో నిత్యం కనిపించే ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణ వినోద పరిశ్రమలో ఎల్లపుడూ హాట్ టాపిక్. అతడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 17 లో కంటెస్టెంట్ అని పుకార్లు వినిపిస్తున్నా దానిని ధృవీకరించాల్సి ఉంది. ఇంతలోనే అతడు తన ఫ్యాషన్ సెన్స్ తో మరోసారి మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చాడు.
ఓర్రీ కొత్త లుక్ యువతరానికి బిగ్ షాక్ నిచ్చింది. అతడు తన హెయిర్ స్టైల్‌ని పూర్తిగా పాశ్చాత్య ధోరణిలో షేపప్ చేసి విదేశీయుడిలా కనిపించాడు. అంతేకాదు చినుగుల నెక్ బనియన్ ధరించి ఒక రకంగా రెబల్ బోయ్‌లా కనిపించాడు. అయితే అవత్రమణి సోషల్ మీడియాలో తన కొత్త రూపాన్ని రివీల్ చేసిన తర్వాత ఆన్లైన్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.
సాంప్రదాయ 9 - 5 ఉద్యోగాలు ఉన్నవారిని ఎగతాళి చేస్తూ అతడు ఒక తీవ్ర వ్యాఖ్య చేసాడు. దీనిపె చాలా మంది నెటిజన్లు ప్రతికూలంగా స్పందించారు. అతడిని క్రూరంగా ట్రోలింగ్ చేసారు. అయితే తనను అవమానిస్తూ మాట్లాడినా కానీ.. తనను తాను ఓర్రీ సమర్థించుకున్నాడు.
సామాజిక మాధ్యమాల్లో అగౌరవంగా మాట్లాడటంపై అసహ్యం వ్యక్తం చేస్తూ వైఖరులు మారాలని అన్నాడు. ఇకపోతే ఓర్రీ జీవించడానికి ఉద్యోగం చేస్తున్నాడన్న సంగతి ఇప్పుడు అందరికీ తెలుసు. అతడు రిలయన్స్ సంస్థల్లో ఉద్యోగం చేస్తూనే నైట్ లైఫ్ ని కాస్ట్ లీగా గడిపేస్తున్నాడు.
బాలీవుడ్ సెలబ్రిటీలందరితో నైట్ పార్టీల్లో మెరుస్తూనే ఉంటాడు. ఓర్రీ గత ఇంటర్వ్యూలో సాంప్రదాయిక ఉద్యోగం కంటే స్వీయ-సంరక్షణ, వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నాడు. తన జీవన శైలిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే వీలుందని కూడా సందేహం వ్యక్తం చేసాడు. ఇక ఓర్రీ ఇటీవలే తాను హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే.