ఆస్కార్ నామినేషన్స్ మళ్లీ వాయిదా..!
ఆస్కార్ నామినేషన్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉండగా లాస్ ఏంజిల్స్ లో మంటల వల్ల నామినేషన్స్ ప్రక్రియ వాయిదా వేశారు.
హాలీవుడ్ లో జరిగే సినీ వేడుక ఆస్కార్ నామినేషన్స్ వేడుక లాస్ ఏంజిల్స్ లో ఏర్పడ్డ మంటల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. నామినేషన్స్ ప్రోగ్రాం డేట్ మారుస్తూ అకాడమీ టీం మెంబర్స్ ప్రకటించారు. ప్రపంచ సినీ వేడుకగా ఆస్కార్ అవార్డులకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అకాడమీ అవార్డుల కోసం ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఆస్కార్ నామినేషన్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉండగా లాస్ ఏంజిల్స్ లో మంటల వల్ల నామినేషన్స్ ప్రక్రియ వాయిదా వేశారు.
అమెరికాలో ఏర్పడిన కార్చిచ్చు ఆస్కార్ నామినేషన్స్ ప్రక్రియని మరోసారి వాయిదా వేసేలా చేశాయి. లాస్ ఏంజెల్స్ లో జరగాల్సిన ఈ నామినేషన్స్ ప్రక్రియ జనవరి 23న నామినేషన్స్ ఫిక్స్ చేశారు. ఐతే లాస్ ఏంజెల్స్ లో చెలరేగిన మంటల వల్ల నామినేషన్స్ వేడుక మార్చాలని ఫిక్స్ అయ్యారు. దీనిపై అకాడమీ కమిటీ సభ్యులు ప్రకటన ఇచ్చారు. నామినేషన్స్ ప్రక్రియ తేదీ మార్చాలని నిర్ణయం తీసుకున్నామని అకాడమీ CEO బిల్ క్రేమర్, అకాడమీ అధ్యక్షుడు జానెట్ యాంగ్ వెల్లడించారు.
లాస్ ఏంజెల్స్ లో కార్చిచ్చు వల్ల ఏర్పడ్డ మటలు హాలీవుడ్ ను చుట్టాయి. ఐతే ఈ మంటల వల్ల చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసే నామినేషన్స్ ప్రక్రియను వాయిదా వేస్తున్నారు. ఆల్రెడీ జనవరి 8 నుంచి 14 వరకు కొనసాగించాల్సి ఉంది. ఐతే అక్కడ మంటల వల్ల ఓటింగ్ లేట్ అవుతూ వచ్చింది. జనవరి 17న నామినేషన్స్ ప్రకటన చేయాల్సి ఉన్నా దాన్ని మళ్లీ జనవరి 19కి వాయిదా వేశారు.
లాస్ ఏంజెల్స్ మంటల వ్యాప్తి ఇంకా తగ్గకపోవడం వల్ల జనవరి 23న నామినేషన్స్ ప్రకటిస్తారని వెల్లడించారు. ఐతే ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ లో జాప్యం వల్ల ప్రేక్షకులు కన్ ఫ్యూజ్ అవుతున్నారు. ఇదిలాఉంటే ఈసారి ఆస్కార్ కి ఇండియా నుంచి ఆరు సినిమాలు నామినేషన్స్ లో ఉన్నాయి. తమిళం నుంచి కంగువ తో పాటు ది గోట్ లైఫ్, వీల్ సావర్కర్ హిందీ పరిశ్రమ నుంచి నామినేషన్స్ లో ఉన్నారు. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, సంతోష్, గర్ల్స్ విల్ బి గర్ల్స్ సినిమా కూడా ఈసారి ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్నాయి.